గత వారం రోజుల  నుంచి శ్రీలంకలో మారణహోం చెలరేగుతుంది.  ఉగ్రవాదులు ఆత్మాహుతి దళాలతో ఎక్కడబడితే అక్కడ బాంబ్ బ్లాస్ట్ లతో దద్దరిల్లిపోతుంది.  ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుంతో అని భయం గుప్పిట్లో ప్రజలు బ్రతుకుతున్నారు.  మరోవైపు ప్రపంచ దేశాలన్నీ శ్రీలంకలో జరిగిన దారుణాలపై ఆవేదన చెందుతున్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు.  ఇదే అదునుగా కొంత మంది ఆకతాయిలు ఫేక్ కాల్స్ తో పోలీసులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. 


శ్రీలంకలో ఉగ్రవాదులు దారుణ చర్యలతో భారత దేశంలో అప్రమత్తమైన పోలీసులు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైళ్లలో బాంబుదాడులకు పథకం వేస్తున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి పోన్.  కర్ణాటక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన అజ్ఞాత వ్యక్తి.    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక డీజీపీలకు సమాచారం. 

కేరళ, పుదుచ్చేరి,గోవా, మహరాష్ట్ర డీజీపీలకు సమాచారం. ఫోన్ సమాచారం పోలీసు యంత్రాగాన్ని అప్రమత్తం చేసిన ఏపీ డీజీపీ.  అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ ఆధారంగా కర్ణాటక పోలీసుల దర్యాప్తు..అది నకిలీ కాల్ గా గుర్తింపు. నకిలీ కాల్ చేసిన ఆర్మీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: