ఇది ఒక సినిమా కథను తలపిస్తుంది...ప్రేమ...కులాంతర వివాహం...హత్య. ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాలలోసంచలనాన్ని సృష్టించింది. అమృత ,ప్రణయ్ లు ఇద్దరూ ప్రేమించుకొని తమతల్లిదండ్రులకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నారు. దీనికన్నా ముందే అమృత తండ్రికి వీరి ప్రేమ విషయం తెలిసి కూతురిని ప్రణయ్ తో తిరగవద్దని హెచ్చరించాడు.తమ కంటే తక్కువ కులం వారితో సంబంధం కలుపుకోవడం అతనికి ఇష్టం లేదు. కానీ అమృత మాత్రం తండ్రి మాటను పట్టించుకోలేదు. ప్రణయ్ అంటే ప్రాణం అమృతకు .


అలా మొదలైంది ...

ప్రణయ్, అమృత లు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఇంజినీరింగ్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళినా, ఇద్దరు వేరు వేరు కాలేజీలలో చదువుకున్నారు. అయినా వారి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకి మరింత దగ్గరయ్యారు .ఒకర్నొకరు వదిలి ఉండలేకపోయారు .అందుకనే వారు 2018 , జనవరి లో హైదరాబాద్ ఆర్య సమాజం లో పెళ్ళి చేసుకున్నారు.


అభ్యంతరం చెప్పిన తండ్రి :

తండ్రి మారుతీ రావు కు తన కూతురంటే అమితమిన ప్రేమ. వారిది ధనవంతుల కుటుంబం. చాలా ఆస్తి కలవారు, ఉన్నత కులానికి చెందిన వారు. మారుతి రావు మిర్యాలగూడ లో పేరు ప్రఖ్యాతలున్న పారిశ్రామిక వేత్త. తనకు ఇష్టం లేని పెళ్లిచేసుకొని తన పరువు తీసిందని కూతురి మీద కోపం పెంచుకున్నాడు అమృత రావు. ఆమె గర్భవతి అని తెలుసుకొని, గర్భం తీసి వేసుకోమని ఆమెను హెచ్చరించినా , తండ్రి మాటను అమృత ఖాతరు చెయ్యలేదు. పుండు మీద కారం చెల్లినట్లు అమృత ప్రణయ్ లు తమ పెళ్ళి రిసెప్షన్ పార్టీ ను మిర్యాల గూడ లో జరుపుకున్నారు.


ఇది మారుతీ రావు కు మరింత ఆవేశాన్ని తెచ్చి పెట్టింది. .ప్రణయ్ కుటుంబానికి డబ్బాశ చూపించాడు .అమృతను విడిచి పెట్టాలని ప్రణయ్ ను బెదిరించాడు .కానీ వారిద్దరూ మాత్రం కలిసే ఉంటామని ఎప్పటికీ విడిపోమని చెప్పారు .అలాగేఉన్నారు . వారి ప్రేమను డబ్బులు ,కులం ఏవి విడదీయలేకపోయాయి పెళ్లి చేసుకుని ఎన్నో కలలు కన్నారు .సంతోషంగా ఉన్నారు కానీ అమృత తండ్రి మాత్రం వీరిని ఎలాగైనా విడదీయాలని కుట్రలు పన్నుతూనే ఉన్నాడు .వీరిని విడదీయడానికి కిరాయి గూండాలను పంపించి బేదిరించినా లాభం లేకపోయింది.  ప్రణయ్ కు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి తన కూతురిని వదిలి వెళ్ళమని చెప్పినా ప్రణయ్ డబ్బులుకన్నా అమృతే కావాలనుకున్నాడు .


ప్రేమ కు ఫలితంగా గర్భం దాల్చిన అమృత

వారి సంతతోషానికి ,ప్రేమకు గుర్తు గా అమృత గర్భం దాల్చింది .ఇక వారి ఆనందానికి హద్దులేవు .పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం ప్రారంభించారు. అమృత ను కాలు కింద పెట్టకుండా , కంటి కి రెప్పలా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ప్రణయ్ .అమృత అత్తవారు కూడా వారిద్దరినీ చూసి మురిసిపోయారు .మనవడి కోసం ఎదురు చూసారు .


ప్రణయ్ హత్య కు కుట్ర...

కూతురు ,అల్లుడూ ఎంత ఆనందంగా ఉన్నా సరే , కూతురు తమ కులం కానివాడిని చేసుకుందనే కసి లోనే ఉన్నాడు అమృత తండ్రి . ఎలాగైనా ప్రణయ్ ని హత్య చేయించాలని పన్నాగం పన్నాడు .సెప్ట్మ్బెర్ 14 న ఒక కిరాయి హంతకుడి తో ప్రణయ్ ను హత్య చేయించాడు .ఆ రోజు గర్భవతి అయిన అమృతను డాక్టర్ కి చూపించడం కోసం నల్గొం.డ జిల్లాలోని మిర్యాలగూడ లో హాస్పిటల్ కు ప్రణయ్ వెళ్ళారు. ప్రణయ్, అమృతలు. హంతకుడి దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ప్రణయ్.


ఈ హత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, మీడియా అమృత కు అండగా నుంచొని ఆమె కు న్యాయం జరగాలని పోరాటాలు చేసాయి. మారుతీ రావు ను పోలీసు లు అరెస్ట్ చేసి జైలు లో వేశారు.


ప్రణయ్ హత్యానంతరం అమృత షాక్ లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. అమృత తన అత్తవారింట్లోనే వుంది. తన తండ్రి మారుతి రావు కు కఠీ న శిక్ష పడాలని వేరే ఏ ఆడపిల్ల ఇటువంటి అన్యాయానికి గురి కాకూడదని ఆమె వేడుకుంది.వివాహమైన 2 నెలల తరువాత నుంచే తన హత్యకు కుట్ర జరుగుతుందన్న అనుమానం తో ప్రణయ్ అప్రమత్తం గా ఉంటున్నాడు.పోలీస్ ల ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా ప్రణయ్ ప్రాణాలు పోకుండా ఎవ్వరూ కాపాడలేకపోవడం విచారకరం.


కూతురి కన్నా పరువు ముఖ్యం :

ప్రణయ్ ను చంపించినందుకు తనకేమి విచారం లేదని అమృత తండ్రి మారుతీ రావు పోలీసులతో అన్నారు. తన పరువు కంటే కూతురు ఎక్కువ కాదని ఆయన అన్నారు. సుపారి గ్యాంగ్ఉ తో ప్రణయ్ హత్య గురించి మాట్లాడుకున్నప్పుడు తన కుమార్తె కు ఎటువంటి హాని చేయొద్దని వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మారుతీ రావు తెలిపాడు.


ప్రణయ్ ప్రతి రూపం కోసమే బతికున్నా ..

ప్రణయ్ చనిపోయే నాటికి అమృత ఇదు నెలల గర్భిణి. ప్రణయ్ హత్యానంతరం అమృత మాట్లాడుతూ తనకు పుట్టబోయే బిడ్డలోనే ప్రణయ్ ను చూసుకుంటానని , ప్రణయ్ ప్రతి రూపం కోసమే బతికున్నా చెప్పింది.అప్పటి నుంచి అత్తవారి సంరక్షణ లోనే వున్న అమృత జనవరి 30, 20 19 న పండంటి మగ బిడ్డ కు జన్మనిచ్చింది. జనవరి 30 వీరి పెళ్ళి రోజు. కావడం విశేషం .ప్రణయ్అమృత ప్రేమ వివాహం చేసుకొని జనవరి 30 కు సరిగ్గా ఏడాది అవుతుంది. అదే రోజు అమృత మగ బిడ్డ కు జన్మ నివ్వడం తో ప్రణయ్ మళ్ళీ పుట్టాడని సంతోషించారు కుటుంబ సభ్యులు .


ప్రణయ్ మళ్ళీ పుట్టాడు...

ప్రణయ్ చనిపోయిన తరువాత జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే పేస్ బుక్ పేజి ను మొదలు పెట్టారు. తమకు మగ బిడ్డ, పుట్టాడని అమృత ఆ పేజి లో ఒక భావోద్వేగా పోస్టు పెట్టింది. "ప్రణయ్ పక్కన లేకుండానే పెళ్ళి రోజు గడిచిపోయిందని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. మన పెళ్లై నేటికి ఏడాది. గతేడాది ఇదే సమయానికి నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా.. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది అతి త్వరలోనే నెరవేరబోతోంది. లవ్ యూ లల్లూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నా’ అంటూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో పోస్టు పెట్టింది.


అమృత పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల నుండి విశేష స్పందన లభించింది. ఆమెకు అండగా ఉంటామని ఎంతో మంది ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రణయ్ ను చంపిన తన తండ్రి, బాబాయి తమకు పుట్టిన బిడ్డను కూడా చంపుతారేమో నని అమృత ఆవేదన వ్యక్తం చేసింది. ప్రణయ్ మళ్ళీ పుట్టాడని సంతోషాన్ని వ్యక్తం చేసింది అమృత.


ఎవరు మారాలి ?

చిన్న తనం లోనే ప్రేమించే భర్తకు దూరమైన అమృత, ,పుట్టకుముందే తండ్రిని పోగొట్టుకున్న పసిబిడ్డ ఎంత దారుణం? .ఇంతగా అభివృద్హి చెందిన మన సమాజం లో ఇంకా కూడా కులం, మతం అంటూ కేకలు పెడ్తున్న మూర్ఖులను ఏమి చేయాలి ? వారిని ఎలా మార్చాలి ? కూతురు కన్నా ,ప్రాణం కన్నా పరువు గొప్పదిగా భావించే పిచ్చి వారిని ఏమి చేయాలి ? వేరే కులం వాడిని ప్రేమిస్తేనే పోయే పరువు , ఒక మనిషి ప్రాణాన్ని తీసి హంతకుడిగా జైలుకెళ్తే పరువు ఉంటుందా ? ఇలాంటి మారుతి రావులు ఇంకా మన సమాజం లో ఉన్నారా ?వారి మధ్యే మనం ఉన్నామా ? కానీ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు. ప్రణయ్ హత్యే చివరిది కావాలి. ఈ సమాజం లో మార్పు రావాలి అంటే మనం మారాలి .ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు ? వారిద్దరిదీ ఒకటే కులమా కాదా? అన్న ప్రశ్నలను మన మనసులలోకి . రాకూడదు , అడగకూడదు .సమాజం మారాలి అంటే ముందుగా మనం మారాలి .


అమృత ,ప్రణయ్ ల కొడుకు కుల రహిత సమాజం లో ఆనందంగా పెరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం .


మరింత సమాచారం తెలుసుకోండి: