ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఎవరిని వరిస్తుదో తెలియడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 


తాజాగా ఇంటలిజెన్స్ పేరుతో ఓ సర్వే కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు  జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ విజయఢంకా మోగించింది. వైసీపీ మొత్తం 8 స్థానాలు గెలుచుకుంది.  టీడీపీ  6 స్థానాలు గెలుచుకుంది. 

ఈ సర్వే ప్రకారం.. ఈ జిల్లాలో వైసీపీ జోరు ఇంకాస్త పెరగనుంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ గతంతో పోలిస్తే మరో రెండు స్థానాలు పెరుగుతాయి. టీడీపీకి  కూడా గతం కంటే రెండు  స్థానాలు తగ్గే అవకాశం ఉంది. వైసీపీ 10- టీడీపీ 4 స్థానాలు గెలుచుకోబోతున్నాయట. 

ఐతే.. సోషల్ మీడియాలో ఎవరుపడితే వారు సొంత సర్వేలను తప్పుడు పేర్లతో సర్క్యులేట్ చేస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. కాకపోతే.. ఉత్కంఠతో ఉన్న వారు ఏదో ఒక సమాచారం కోసం అంటూ వీటిని ఫాలో అవుతున్నారు. అసలు విషయం మే 23న కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: