మనం నిజాయతీగా ఉంటామని నీతిమంతులమని నిప్పు అని చెప్పుకోవటం కాదు. అలా నిప్పు అని ప్రజలకు కూడా మన ప్రవర్తన ద్వారా తెలియాలి అలా కనిపించాలి. మనసా వాచా కర్మణా మన నీతి నిజాయతీ కనిపించాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనం చేసిన పని వెరేవాళ్లు చేస్తే వాళ్లు దుర్మార్గులని ఎత్తి చూపటంలోనే మన వ్యక్తిత్వమేమిటో ప్రస్పుటంగా కనిపిస్తుంది.


బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ 2009, 2014లో కంటే 2019లో ఈవీఎంలపై ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేస్తారనీ, ట్యాంపరింగ్ అవుతాయనీ, ఒకరికి ఓటు వేస్తే మరికొరికి ఓటు పడుతోందనీ ఇలా రకరకా లుగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.

Image result for chandrababu & Vemuru hari krishna prasad

ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ఎన్నికల సంఘం వీవీప్యాట్ మెషిన్లను తెచ్చింది. వాటి ద్వారా ప్రజలు ఓటు వేసినప్పుడు ఎవరికి ఓటు వేసిందీ క్లియర్‌గా చూసుకున్నారు. 7 సెకండ్ల పాటూ కనిపించే రిసీట్‌లో ఏ గుర్తుకు ఓటు పడిందో తెలుసుకున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. పార్టీలు మాత్రం ఈవీఎంల అంశాన్ని లేవనెత్తి, వాటి ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు యత్నిస్తున్నాయ న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 30 శాతం ఈవీఎంలు మొరాయించాయ న్నది కొందరు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఇది నిజం కాదు. ఏపీ ఎన్నికల్లో మొత్తం 46 వేలకు పైగా ఈవీఎంలను ఉపయోగించారు. వాటిలో మొరాయించి నవి దాదాపు 400. అధికారులు 300 ఈవీఎంలను తిరిగి సరిచేశారు. 100 ఈవీఎంలను మాత్రం తొలగించి, వాటి స్థానంలో రిజర్వ్‌గా ఉంచిన ఈవీఎంలను తిరిగి సెట్ చేశారు.


టీడీపీ ఆరోపించినట్లు 30 శాతం ఈవీఎంలు పనిచేయకపోవడమంటే 13000కు పైగా ఈవీఎంలు మొరాయించినట్లు లెక్క. ఇది ఏమాత్రం నమ్మదగిన అంశం కాదు. అసలు ఇన్ని ఈవీఎంలు మొరాయిస్తే, ప్రజలు ఊరుకుంటారా? ఎన్నికలు వాయిదా పడేవే. చిన్న అంశాన్ని కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ రాద్ధాంతం చేస్తోందన్నది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ.

Image result for chandrababu & Vemuru hari krishna prasad

వీవీప్యాట్ స్లిప్పుల విషయంలోనూ టీడీపీ తనదైన వాదన తెస్తోంది. వీవీప్యాట్ స్లిప్పులు కొన్ని చోట్ల 7 సెకండ్లకు బదులు 3 సెకండ్లే వచ్చాయన్నది టీడీపీ ఆరోపణ. నిజానికి వీవీప్యాట్ సాఫ్ట్‌వేర్ ప్రకారం స్లిప్పు 7 సెకండ్లు కనిపిస్తుంది. లేదంటే, ఆ మిషన్ సరిగా పనిచెయ్యకపోతే అసలు స్లిప్పే కనిపించదు. అంతేగానీ 3 సెకండ్లు మాత్రమే కనిపించే అవకాశాలు తక్కువ. అలా జరగాలంటే సాఫ్ట్‌వేర్‌ లో మార్పులు చెయ్యాలి. కొన్ని వీవీప్యాట్లకు ఒకలా, మరికొన్ని వీవీప్యాట్లకు ఒకలా సాఫ్ట్‌వేర్ ఉండదు కాబట్టి ఈ వాదనను చట్టపరంగా నిలిచే అవకాశాలు చాలా తక్కువ.


ఒక వైపు తామే అధికారంలోకి వస్తామనీ, భారీ మెజార్టీతో గెలుస్తామనీ టీడీపీ నేతలంటు న్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబైతే ఏకంగా తాము 110-120-130-140-150 స్థానాలు ఇలా పలు సందర్భాల్లో పలు సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలు గెలుస్తామని ప్రకటించారు కూడా. మరి అంత విశ్వాసం ఉన్న ప్పుడు, ఈ ఈవీఎంలు, వీవీప్యాట్ల విషయంలో ఆందోళన ఎందుకన్నది వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న.

Image result for chandrababu & Vemuru hari krishna prasad

ఓడిపోతారన్న ఉద్దేశంతోనే ఏదో ఒక వంకను తెలుగుదేశం వెతుక్కుంటూ,కావాలనే దేశవ్యాప్తంగా హడావుడి చేస్తున్నారన్నది వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. 2014లో ఇవే ఈవీఎంలతో వచ్చిన ఫలితాలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటున్న వైసీపీ నేతలు, ఒకవేళ ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ చెబుతున్నట్లు టీడీపీయే అధికారంలోకి వస్తే, ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును రద్దు చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీడీపీ నుంచీ ఎలాంటి సమాధానమూ లేదు.


తాము గెలిస్తే ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పనిచేసినట్లు లేక ప్రతిపక్షమో మరొకరో గెలిస్తే ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయనట్లు మాట్లాడటం లోని ఔచిత్యాన్ని ప్రతిపక్షం మాత్రమే కాదు ప్రతి ఆలోచనాపరుడు ప్రశ్నిస్తున్నాడు.


ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయనీ, వాటిని నివృత్తి చేసేందుకే 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని కోరుతున్నామని చంద్రబాబు వాదిస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపు జరిగితే, ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశాలు దాదాపు తక్కువే. ఎందుకంటే అన్ని పరీక్షలూ చేసిన తర్వాతే ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడకంలోకి తెచ్చారు. అందువల్ల ఆ యంత్రాలు తప్పుగా పనిచేసే అవకాశాలు దాదాపు లేవు. మొరాయిస్తాయే తప్ప మిస్టేక్ చెయ్యవు అంటున్నారు టెక్నికల్ నిపుణులు. స్ట్రాంగ్ రూంలలో భారీ భద్రత కల్పించడం వల్ల ఆ యంత్రాల్ని ట్యాంపరింగ్, హ్యాకింగ్ చేసే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. టెక్నాలజీని ఎంతగానో నమ్మే చంద్రబాబు... ఈవీఎంల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా నానా హంగామా చెయ్యడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇలా ఈ అంశం ఎన్నికలు జరిగిన రెండు వారాల తర్వాత కూడా రచ్చ రేపుతూనే ఉంది.

Image result for chandrababu & Vemuru hari krishna prasad

ఏపిలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్ నిపుణుడుగా వినపడుతున్న పేరు హరి కృష్ణ ప్రసాద్ వేమూరు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. ఓటేసిన ఓటరుకు వీవీప్యాట్ స్లిప్ లో తానెవరికి ఓటేశారో ఏడు సెకనులు కనిపించాల్సింది మూడు సెకనులే కనిపించిందని వ్యాఖ్య చేశారు దాన్నే చంద్రబాబు ఉటంకిం కిస్తూ ఉంటారు. అయితే ఈ హరిప్రసాద్ వేమూరుకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక సాంకేతిక నైపుణ్యంతో కూడిన పనులను ప్రత్యక్షంగా లేక పరోక్షముగా ఆయనకు ఆయనకు సంభంధం ఉన్నవారికే కట్టబెట్టారని ప్రజల్లో ప్రచారమే కాదు ఏటీఎంల దొంగతనంలో ఈయనపై ఎన్నికల కమీషన్ ఆరోపణ కూడా!

Image result for chandrababu & Vemuru hari krishna prasad

అసలు ఈవీఎంలలో లోపాలుంటే వివిపాట్ లో ఓటర్ కు తాను ఎవరికి ఓటేశారో అజలే కనిపించదు. ఆంతేగాని ఏడు సెకనులు కనిపించాల్సిన చోట మూడు సెకనులు కనిపించటం అనేది ఒక వితండ వాదన మాత్రమే అవుతుంది. ఇలాంటి వ్యక్తుల సామాజిక వర్గమో ఇంకా ఏ యితర విషయాల సామ్యమో చూసి ఆయన మాటలు నమ్మితే ముఖ్యమంత్రైన తెలుగుదేశం అధినేత ఇంత అంత అనుభవం ఉందని చెప్పుకున్నా జనం మదిలో అనుభవ శూన్యుడే కదా!    

Related image

మనం నిజాయతీగా ఉంటామని నీతిమంతులమని నిప్పు అని చెప్పుకోవటం కాదు. అలా నిప్పు అని ప్రజలకు కూడా మన ప్రవర్తన ద్వారా తెలియజేయాలి అలా కనిపించాలి. మనసా వాచా కర్మణా మన నీతి నిజాయతీ కనిపించాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనం చేసిన పని వెరేవాళ్లు చేస్తే వాళ్లు దుర్మార్గులని ఎత్తి చూపటంలోనే మన వ్యక్తిత్వమేమిటో ప్రస్పుటంగా కనిపిస్తుంది.

Image result for chandrababu & Vemuru hari krishna prasad

ఎన్నికల్లో ఓడిపోతామని అనుమానం ఉన్నవాళ్లు ఓడిపోయినవాళ్లు మాత్రమే ఈవిఎంలపై వివిప్యాట్లపై అభియోగాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. యంత్రాలపై తప్పు లేసేస్తే నమ్మటానికి ఇప్పుడు ప్రతింట్లో ఒక సాంకేతిక నిపుణుడున్న రోజులివి. జనం ఇప్పుడు నిజాన్ని సూటిగా అర్ధం చేసుకుంటున్నారు. బిహైండ్ ది లైన్స్ బిట్వీన్ ది లైన్స్ గమనిస్తూ అర్ధం చేసుకోవటంలో నలభైయేళ్ళ నిలువెత్తు అనుభవాన్ని మించి ఎదిగిపోయారు. పసివాళ్ళు గా పుట్టేటప్పుడే అద్భుత పరిఙ్జానంతో భూమ్మీదకి వస్తు న్న రోజులివి.

Image result for chandrababu & Vemuru hari krishna prasad

ఒక ముఖ్యమంత్రి "కన్-ఫర్మ్ చేయలేను" కాని, రష్యన్ సాంకేతిక నిపుణులు ఈవీఎంలను విజయవంతంగా హాక్ చేయగలరని చెప్పటం భారత దేశ ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా అవమానించటమే. అందుకే జనం ఈ రష్యన్ ఈవీఎం హాకింగ్ సాంకేతికతను గత 2014లో ఉపయోగించుకొని గెలిచి అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. టాలెంట్ ప్రయోగించి ఇంకా జనా నయనాలకు అబద్ధాల కంచె కడతానని అనుకొంటే అంతకంటే మూర్ఖం లేదని అంటున్నారు.


‘టీడీపీ తరఫున హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడిని పంపారు. ఆయనపై 2010లో ఈవీఎం మెషిన్‌ దొంగతనం ఆరోపణలు ఉన్నాయి. 2010 మార్చి 13న ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు  కూడా నమోదైంది. ఆ కేసు విచారణ ఏమైనప్పటికీ, ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం సముచితం కాదు. దీనికి సంబంధించి గూగుల్‌లో వచ్చిన కథనం, ఆ ఫొటోను కూడా ఈ లేఖకు  జతచేస్తున్నాం. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో సభ్యులుగా చేర్చడం సముచితమా? అని ప్రశ్నించింది. హరిప్రసాద్ స్థానంలో వేరే వ్యక్తిని పంపండి' అంటూ లేఖ రాసింది. ఇది చంద్రబాబు ఇంటిగ్రిటీని బట్టబయలు చేస్తుంది

- writes to Andhra CM @ncbn saying "you got us to meet a man with a criminal background".They alleged the person who came to the meeting has been charged of EVM theft in the past. EC in its letter says - "such antecedents don't inspire confidence"

మరింత సమాచారం తెలుసుకోండి: