ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ.. భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతే ఏమవుతుందో చూద్దాం.. 


జగన్ ఓడిపోతే.. వైసీపీ పార్టీ దారుణంగా నష్టపోతుంది. ఇప్పటికే తొమ్మిది పదేళ్లుగా అధికారం లేకపోయినా పార్టీని నడుపుకుంటూ వచ్చిన అభ్యర్థులు, నాయకులు ఇంకా పార్టీని బతికించే పరిస్థితి ఉండదు. గెలిచిన కొద్ది మంది కూడా గతంలోలా టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ. 

జగన్ కూడా ఎవరినీ ఏమీ అనే పరిస్థితి ఉండదు. జగన్ ఓడితే.. మరోసారి జగన్ కేసుల ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది. అవసరమైతే మరో రెండు కేసులు పెట్టించైనా సరే జగన్ ను జైలు పాలు చేసే ప్రయత్నాలు జోరందుకుంటాయి. ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లోనూ పొత్తులు పెట్టుకోని జగన్ ఇక ముందు ఆ పరిస్థితి కొనసాగించే అవకాశం లేకపోవచ్చు. 

ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుంటే తప్ప భవిష్యత్‌ లో మనుగడలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా టీడీపీకి చుక్కలు చూపిస్తున్న పార్టీ రేపు జగన్ ఓడితే నామ్‌ కే వాస్తే గా మారిపోవచ్చు కూడా. ఇవీ జగన్ పార్టీ ఎన్నికల్లో ఓఢితే జరిగే పరిణామాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: