ఎన్నికల కౌంటింగ్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎదురుచూసే శుభఘడియ అది. అది వచ్చేది మే 23నే. ఏపీ, తెలంగాణలోనే కాదు. దేశమంతటా మే 23 హడావిడి మామూలుగా ఉండదు. రాజకీయ నాయకుల ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేది ఆరోజే కదా మరి. 


మరి ఎన్నికల కౌంటింగ్‌లో ఏజెంట్ల విధులేంటి.. ఓట్ల లెక్కింపులో వారు తీసుకోవాల్సిన జాగ్రతలేంటి.. ఏజంట్ అజాగ్రత్తగా ఉంటే.. ఎంత అనర్థం జరుగుతుందో చూద్దాం.. ఆ రోజు ఏజంట్ ఏంచేయాలంటే..

ఓటర్ల సంఖ్యను, పోలైన ఓట్ల సంఖ్య తెలిపే ఫారమ్ 17cని తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి. ఫారమ్ 17లలో ఉన్న కంట్రోల్ యూనిట్ నెంబర్, ఈవీఎంపై ఉన్న నెంబర్ ఒకటేనా లేదా అన్నది చూసుకోవాలి. ఈ వీఎం మిషన్లపై సీళ్లు తొలగి ఉంటే ఓటింగ్ కు అంగీకరించకూడదు. 

కంట్రోల్‌ యూనిట్‌లో పోలింగ్ తేదీ, సమయం సెకండ్స్ తో సహా చెక్ చేసుకోవాలి. ఈ విషయాల్లో ఎలాంటి తేడాలు ఉన్నా ఏజెంట్లు తప్పనిసరిగా అలర్ట అవ్వాలి. కౌంటింగ్‌కు ఒప్పుకోకండా నిరసన తెలపాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: