ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది. విజయవాడకు చేరుకున్న దర్శకుడు వర్మను బలవంతంగా పోలీసులు విమానంలోనే తిరుగుటపా కట్టించారు.  అప్పట్లో వైసిపి ఎంఎల్ఏ రోజా ఇపుడు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సేమ్ టు సేమ్. ఇద్దరికీ ఒకేలా జరిగింది. ఇద్దరినీ విజయవాడ విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ కు తరలించారు. ఏపిలో చంద్రబాబునాయడు మార్కు ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా వర్ధిల్లుతోందనటానికి తాజా ఘటనే నిదర్శనం.

 

రోజా అయినా వర్మ అయినా ప్రజాస్వామ్యానికి హానికరంగా ఏమీ ప్రవర్తించలేదు. వారి వల్ల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతమూ కలగలేదు. అయినా సరే చంద్రబాబుకు ఇష్టంలేదు కాబట్టి విమానాశ్రయాన్ని దాటి రానీయకుండా హైదరాబాద్ కు పార్శిల్ చేసి పంపేశారు.

 

మహిళా సదస్సులో పాల్గొనాల్సిందిగా రోజాను అప్పట్లో అసెంబ్లీ స్పీకరే ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు విజయవాడకు చేరుకున్న రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించారు. ఎందుకయ్యా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారనే సమాచారం ఉందట. అందుకని మహిళా సదస్సులో పాల్గొనకుండా అడ్డుకుని బలవంతంగా రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు పంపేశారు.

 

ఇక తాజాగా రామ్ గోపాల వర్మను కూడా అదే అనుమానంతో హైదరాబాద్ కు తరలించారు. లక్ష్మీస్ ఎన్టీయార్ విడుదల విషయంలో ఏపి ప్రభుత్వానికి, వర్మకు మధ్య తలెత్తిన వివాదమే కారణంగా తెలుస్తోంది. సినిమాలో చంద్రబాబును వర్మ విలన్ గా చూపించారు. దాంతో వర్మంటే చంద్రబాబు అండ్ కోకు ఒళ్ళు మండిపోతోంది. సినిమా విడుదల విషయమై విజయవాడకు చేరుకున్న వర్మను పోలీసులు అడ్డుకుని తిరిగి హైదరాబాద్ కు పంపేశారు. 

 

చివరకు ఏదైనా హోటల్ కు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకుంటానని వర్మ మొత్తుకున్నా పోలీసులు వినలేదు. తనకు వ్యతిరేకంగా లేచే గొంతులను నొక్కేయాలనుకునే వాళ్ళు డిక్టేటర్లు అవుతారే కానీ ప్రజాస్వామ్య పరిరక్షకులు కాలేరన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోతున్నారు. ప్రతీరోజు ప్రజాస్వామ్య స్పూర్తిని, విలువలను ప్రవచించే చంద్రబాబు చేతల్లో ఎలా వ్యవహరిస్తున్నారో అనటానికి వర్మకు ఎదురైన ఘటనే తాజా ఉదాహరణ.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: