తెలంగాణలో ఓ వైపు ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థులు ఒక్కొక్కరూ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకుల ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలకు సిబ్బందిని..గ్లోబరినా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు వద్ద ధర్నా, నిరసన చేస్తున్నారు. 

తాజాగా తమిళనాడు పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తమిళనాడు ఎస్ఎస్ఎల్‌సీ 10వ తరగతి పరీక్ష 2019 ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (డీజీఈ) విడుదల చేసింది. ఏకంగా 95.2 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈ వివరాలను tnresults.nic.in, dge.tn.gov.in, dge1.tn.nic.in. వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని డీజీఈ అధికారులు పేర్కొన్నారు. ఇక తిరుప్పూరు జిల్లాలో అత్యధిక సంఖ్యలో 98.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా తిరుప్పూర్ ఖ్యాతిని సంపాదించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: