భార‌త సైన్యం భారీ మంచు మ‌నిషి అడుగుల్ని గుర్తించారు. సైన్యానికి చెందిన ప‌ర్వ‌తారోహ‌కులు ఒక భారీ మంచు మ‌నిషి అడుగుల‌ను హిమాల‌యాల్లో ప‌సిక‌ట్టారు. దానికి సంబంధించిన ఫోటోల‌ను కూడా భార‌త సైన్యం ట్వీట్ చేసింది. హిమాల‌యాల మంచు ఉపరితలంపై య‌తి-మంచు మ‌నిషి అడుగులు కనిపించినట్లు సైన్యం వెల్ల‌డించింది. ఈ హిమాల‌య దేశాల్లో ఇతిహాసాల ప్రకారం య‌తి అని పిలవబడే భారీ మంచు మ‌నిషి, నేపాల్‌, టిబెట్‌, భార‌త్‌ తో పాటు సైబీరియా మంచు పర్వత ప్రాంతా ల్లో తరచుగా కనిపిస్తున్నట్లు చూసినవారు చెపుతుంటారు. 
Image result for yeti footprints sent by indian army
హిమాలయాల్లో అతి భారీ పాదాలు క‌లిగిన రాకాసి జీవులు ఉన్న‌ట్లు కొన్ని పురాణ క‌థ‌లు చెబుతున్నాయి. ఆ క‌థ‌ల ప్ర‌కారం, రాకాసి అంటే అతి భారీ య‌తి అడుగు ఒక్క‌టి 32క్ష్15 అంగుళాల పరిమాణం ఉన్నట్లు చెపుతున్నారు. నేపాల్‌ లోని 'మ‌కాలు బారున్ జాతీయ పార్క్' వ‌ద్ద ఈ ఆన‌వాళ్ల‌ను గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. అయితే య‌తి అడుగు ల‌ చిత్రాలను  ట్వీట్ చేసిన ఇండియ‌న్ ఆర్మీ, ఆ భారీ మంచుమ‌నిషికి సంబంధించిన మ‌రిన్ని చిత్రాల‌ను, వీడియోల‌ను ఇవాళ మ‌ళ్లీపోస్టు చేయ‌నున్నారు. య‌తి - మంచు మ‌నిషికి సంబంధించిన వాస్త‌విక ఆధారాలు ఉన్నాయ‌ని, ప్ర‌త్య‌క్ష‌ సాక్షులు కూడా ఉన్న‌ట్లు సైన్యం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 
Image result for yeti footprints sent by indian army
నేపాలీ ఫోక్ లేదా జాన‌ప‌థ క‌థ‌ల ప్ర‌కారం, య‌తి ఒక భారీ ఆకారం క‌లిగిన జీవి. అదొక అడ‌వి జంతువు "ఏప్" త‌ర‌హాలో ఉంటుంది. ఇది కేవ‌లం హిమాల‌యాలు, మ‌ధ్య ఆసియా, మరియు సైబీరియా ప్రాంతాల్లో జీవిస్తుంది. ప‌ది రోజుల క్రితం "య‌తి" కి సంబంధించిన ఆధారాలు దొరికిన‌ట్లు తెలుస్తోంది. మంచు ఉపరితలంపై ఉన్న య‌తి అడుగుల ఆధారాల‌ను ఫోటోలు తీసిన సైనికులు, వాటిని సంభందిత శాసత్రవెత్తలకు పంపారు. సాధార‌ణంగా య‌తిని ఒక మంచుమ‌నిషిగా భావిస్తారు. ఆదికాల‌పు
మంచుమ‌నిషిగా య‌తిని గుర్తిస్తారు. అతి భారీశ‌రీర ఆకారంతో భ‌యం పుట్టించే రీతిలో యతి ఉంటారు. యతి గురించి ఇంకొన్ని విషయాలు కొద్దిరోజుల్లో తెలవనున్నాయి. 

Image result for yeti footprints sent by indian army

మరింత సమాచారం తెలుసుకోండి: