ఏపీలో ప్రెస్ మీట్ పెట్టడానికి విఫలయత్నం చేసి ఆపై  చంద్రబాబుపై విమర్శలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి నిప్పుల వర్షం కురిపించారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సరికాదంటూ టీడీపీ నాయ‌కురాలు దివ్యవాణి తీవ్రస్థాయిలో స్పందించారు.  సమస్యను సమస్యగా మాట్లాడడం వర్మ నేర్చుకోవాలని అన్నారు.


రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ఏమీ లేదని, లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త వీరగంథం గారు ఎప్పుడో చెప్పారని, ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడని దివ్యవాణి పేర్కొన్నారు.ఇవాళ మీపై విమర్శలు చేయడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వస్తోందని.. ఓ సంస్కారవంతుడైన నాయకుడి వద్ద మేం పనిచేస్తున్నామ‌ని.. అందుకే ఎంతో బాధతో మాట్లాడాల్సి వస్తోందని దివ్య‌వాణి అన్నారు. వ‌ర్మా! జాగ్రత్త! నీ కప్ప కనుగుడ్లని తెలుగింటి ఆడపడుచులు పీకిపడేసి నిన్ను కళ్లు లేని కబోదిని చేస్తారు. ఒక పసిబిడ్డ తల్లి వద్ద పాలు తాగుతున్నా కూడా దాన్నొక బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది. 


దెయ్యాలు లేవు, దేవుళ్లు లేవు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి నాకు చెప్పింది, అందుకే సినిమా తీస్తున్నానంటూ నువ్వు కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం! ఏపీ ప్రజలేమీ అంత అమాయకులు కాదు.  ఒకవేళ నీకు  కోడికత్తి పార్టీ మీద ఆసక్తి కలిగితే ధైర్యంగా కండువా కప్పుకో.. ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసుకో. అంతేతప్ప చంద్రబాబునాయుడితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. సీఎం పోస్టులో ఎవరున్నా గానీ వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి" అంటూ వ‌ర్మ‌పై దివ్య‌వాణి ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: