తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు ఈసారి జరుపుతారా లేక వాయిదా వేస్తారా. ఈ డౌట్ చాలా మంది టీడీపీ పెద్దల్లో ఉంది. ఎందుకంటే మహానాడు ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి నాలుగు రోజుల ముందు అంటే మే 23న కౌంటింగ్ జరుగుతుంది. అందువల్ల మహానాడు ఈసారి ఉంటుందా  లేదా అన్నది తమ్ముళ్ళ ధర్మ సందేహం.


అయితే మహానాడు విషయంలో టీడీపీ ఈసారి కొత్త ఆలొచనన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మహానాడును కాస్తా ముందుకు జరుపుతారు. అంటే ఈ నెల 15 నుంచి 17 వరకూ మూడు రోజుల పాటు నిర్వహిస్తారని చెబుతున్నారు. అది కూడా హైదరాబాద్ గండిపేటలో చాలా సాదాసీదాగా నిర్వహిస్తారని అంటున్నారు. ఇలా చేయడం వెనక కి అనేక షాకింగ్ రీజన్స్ బయటకు వస్తున్నాయి. అవేంటో చూస్తే చిత్రంగా అనిపిస్తుంది.


టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి మహానాడు నిర్వహణ కేవలం మూడు రోజుల వ్యవధిలో కుదరదు అన్నది టీడీపీ ఇన్నర్ సర్కిల్ మాటగా ఉంది. ఇక అసలైన కారణం మరోటి ఉందని అంటున్నారు. అదేంటంటే ఈసారి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు అన్నది చాలా మంది టీడీపీ నేతల్లో ఉంది. కౌంటింగ్ జరిగిన వెంటనే పార్టీ ఓడిపోతే మొత్తం పార్టీ అంతా డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. 


స్వయంగా అధినేత సైతం ఆ షాక్ నుంచి తొందరగా కోలుకోలేరు. అందువల్ల మహానాడు ని కాస్తా ముందు అంటే కౌంటింగ్ కి కంటే ముందే పెట్టేసుకుంటే ఫలితాలు ఏ విధంగా వచ్చినా ఇబ్బంది ఉండదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట. అందువల్ల ఈసారి మహానాడు గ్రాండ్ లెవెల్లో కాకుండా తూతూ మంత్రంగానే జరిపేసుకుంటారని చెబుతున్నారు. మరి టీడీపీకి ప్రాణ వాయువులాంటి మహానాడే ఇలా జరుపుకుంటున్నారంటే ఎన్నికల ఫలితలా మీద ఆ పార్టీకి ఉన్న ధీమా ఏపాటిదో అర్ధమైపోతోందని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: