ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 23న వెలువ‌డే ఫ‌లితాల కోసం  అంతా ఆస‌క్తిక‌రంగా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఏ ఇద్దరిని క‌దిపి చూసినా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వస్తాడనే చర్చే జ‌రుగుతోంది.  జగన్ సీఎం అవుతారన్న ప్రచారం అన్నివ‌ర్గాల్లో జ‌రుగుతుండ‌టంతో మ‌రో ఊహించ‌ని ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే క‌డ‌పలో భూములకు ద‌ర‌ల‌కు రెక్కలు రావ‌డం. 


ఎన్నిక‌ల ఫ‌లితాలు వన్ సైడ్ ఉంటాయ‌నే టాక్ వెలువ‌డుతుండ‌టం, ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌నే టాక్ నేప‌థ్యంలో....క‌డ‌ప‌లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక ముందే కొనేస్తే, వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మంచి రేటుకు అమ్ముకోవచ్చని చాలా మంది రియల్టర్లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో అమ్మకాలు, కొనుగొల్లు పెరిగాయి. గత నెల రోజుల క్రితం కూడా సెంట్ భూమి రెండు లక్షలు పలికేది. ఇప్పుడు అది మూడిందతలు పెరిగింది. దీంతో కొంతమంది స్థలాలు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటే, మరికొందరు ఏకంగా కొత్త ఇళ్లనే కొనేస్తున్నారు. రిజల్ట్స్ వచ్చాక ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పలువురు ముందే కొనుగోలు చేస్తున్నారు. 


ఇంత‌కీ...ఏ లెక్క‌న రియాల్ట‌ర్లు ఇంత ధ‌ర పెట్టి భూములు కొనుగోలు చేస్తార‌నే క‌దా మీ సందేహం... దివంగ‌త‌ వైఎస్సార్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట అనే సంగ‌తి తెలిసిందే. వైయస్ఆర్ టైంలో కడప జిల్లాలో చాలా వరకూ అభివృద్ది జరిగింది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో కడప జిల్లాలో భూములకు రెక్కలొచ్చాయి. ఎప్పుడూ లేనంతగా ఇక్కడి భూములకు ధరలు పెరిగాయి. జిల్లాలో విస్తృతంగా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ రియల్ బూమ్ కొనసాగింది. ఈసారి జ‌గ‌న్ అధికారంలో వ‌స్తుండ‌టంతో...ఇంకేముంది....రియ‌ల్ భూమ్ ఊపందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: