ఏపీలో రాజకీయం చిత్రంగా  ఉంది. గత నెల 11న జరిగిన పోలింగులో టీడీపీ, వైసీపీ  ఢీ అంటే ఢీ అంటూ దూసుకొచ్చాయి. పోలింగ్ సైతం బ్రహ్మాండంగా జరిగింది. 80 శాతానికి చేరుకుంది. పోలింగ్ ముగిసిన వెంటనే జగన్ మాట్లాడుతూ తాము భారీ మెజారిటీతో గెలుస్తామని మీడియా ముందు చెప్పేశారు. ఇక టీడీపీ నేతలు కూడా తామే గెలుస్తున్నట్లుగా ప్రతీ రోజూ చెబుతున్నారు.



ఈ నేపధ్యంలో జగన్ అసలు మాట్లాడకపోవడం వెనక కారణాలు ఏంటి అన్న దానిపైన ఇపుడు వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఏప్రిల్ 11న మాత్రమే గెలుస్తామని ఒక్క మాట చెప్పిన జగన్ ఈ మధ్య  అసలు మాట్లాడడంలేదు. ఆయన ఇలా సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటన్నది పార్టీ వారికి అంతుపట్టకుండా ఉందిట. ఇక జగన్ పార్టీ వారితో సైతం పిలిచి మాట్లాడడం కూడా జరగడం లేదు. సమీక్షలు అంటూ టీడీపీ అధినేత ఓ వైపు హడావుడి చేస్తూంటే జగన్  పార్టీ నాయకులను ఎవరినీ పిలిచి మీటింగులు పెట్టలేదు.



మన పరిస్థితి ఏంటని వాకబు చేయలేదు. మరి జగన్ ఇలా ఉండడంతో ఆ పార్టీ వారు కంగారు పడుతున్నారు. అయితే జగన్ ఈసారి వ్యూహాత్మకంగానే సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా మౌనంగా ఉండడమే బెటర్ అని జగన్ భావిస్తున్నారుట. అతి చేయడం వల్ల 2014లో ఇబ్బంది పడ్డామని,   ఈసారి అలాంటి వాటికి దూరంగా  ఉండాలని కూడా జగన్ అనుకుంటున్నారుట. మొత్తానికి జగన్ మౌనం పార్టీ క్యాడర్లో కొత్తా అలోచనలు రేపుతూండగా అదేం లేదు జగన్ దేవుడు, ప్రజలనే నమ్ముకున్నారని పెద్ద నేతలు  అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: