చాలా రోజుల తర్వాత తెలంగాణ బంద్ అన్న మాట వినిపిస్తోంది. ఇంటర్ పరీక్షల వ్యవహారంలో దోషులకు కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌ తో బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఇది రాజకీయాల కోసం చేస్తున్న బంద్ కాదని.. పిల్లల భవిష్యత్ కు సంఘీభావంగా ప్రజలు మద్దతు తెలపాలని బీజేపీ కోరుతోంది. 


ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యాపార, విద్యాసంస్థలకు యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాలని ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.  


తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో గందరగోళంపై విపక్షాలు కొన్నిరోజులుగా పోరాడుతున్నాయి. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం భావించింది. ఇప్పటికే ఏప్రిల్‌ 29న లక్ష్మణ్ దీక్ష కూడా చేశారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 


అయినా ఆయన నిమ్స్‌ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఈ బంద్‌ విపక్షాలతో మాట్లాడి సంయుక్తంగా చేస్తే ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక్క బీజేపీ మాత్రమే బంద్‌కు పిలుపు ఇవ్వడంతో.. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: