ఏపిలో ఎన్నికల సందర్భంగా వైసీపీ, టీడీపీ ల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది.  గత నెల 11న పోలింగ్ పూర్తయ్యింది..ఈ సందర్భంగా ఈవీఎం లలో ఎన్నో తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు ఈసిపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.  తాజాగా చంద్రబాబు పై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ప్రస్తుతం కేడర్ కు ముఖాలు చూపించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 

  ఏపీ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన సమావేశాలకు రావడంలేదని చంద్రబాబు వాపోతున్నారనీ, సీఎస్ అంటే అంతలా ఎందుకు భయపడుతున్నా రని ఆమె టీడీపీ అధినేతను ప్రశ్నించారు. గతంలొ చంద్రబాబు చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయని..హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

చేసిన తప్పులు బయటపడకూడదన్న తాపత్రయం చంద్రబాబు ముఖంలో కనిపిస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విధ్వంసమేనని స్పష్టం చేశారు.ఫణి తుపాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను చంద్రబాబు కనీసం అభినందించలేదని గుర్తుచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: