న‌గ‌రంలో డ్ర‌గ్స్ ముఠాను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. మ‌హిళ‌ల్ని సెక్స్ కు ప్రేరేపించే మత్తు ప‌దార్థాల‌ను త‌యారు చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు. బెంగ‌ళూరులో తీగ‌లాగితే.. హైద‌రాబాద్ లో ఈ ముఠా డొంక క‌దిలింది. పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకొచ్చాయి. ఈ గ్యాంగ్ చేసిన అరాచ‌కాలు తెలిసి పోలీసుల‌కే ఆశ్చ‌ర్య‌పోయారు. 


ఐదేళ్లుగా గుట్టుచ‌ప్పుడు కాకుండా సాగిస్తున్న సెక్స్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లైంది. బెంగ‌ళూరులో ప‌ట్టుబ‌డిన నిందితులిచ్చిన స‌మాచారంతో తీగ‌లాగితే హైద‌రాబాద్‌లో డొంక క‌దిలింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి విష‌యం ఎవ‌రూ విని ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ అరాచ‌కాల‌ను మీరు వింటూ ఔరా అంటూ ముక్కుమీద వేలేసుకుంటారు. 


న‌గ‌ర శివారులోని నాచారంలో సెక్స్ డ్ర‌గ్స్ త‌యారు చేస్తున్న ఓ ఫ్యాక్ట‌రీని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. ఇంకెమ్ అనే ల్యాబ్‌లో ఐదు సంవ‌త్స‌రాలుగా ఈ మ‌త్తు మందును త‌యారు చేసి విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. కెటామిన్ అనే ఈ మ‌త్తుమందును మ‌హిళ‌ల‌పై ప్ర‌యోగిస్తే ఐదు గంట‌ల పాటు వారు మ‌త్తులో ఉంటార‌ని నార్కొటిక్ అధికారులు చెప్పారు. అయితే ఈ డ్ర‌గ్స్‌తో చాలా మంది అమ్మాయిల‌పై ప్ర‌యోగించ‌న‌ట్లు.. వారి పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి నాచారంలో ఉన్న‌ ఇంకెమ్ సంస్థ‌ను సైతం అధికారులు సీజ్ చేశారు. 


అయితే బెంగళూరులో డ్రగ్స్ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ కేటామిని అనే మత్తు మందు ఇచ్చి.. సృహ కోల్పోయిన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీశారు.. దీంతో ఈ డ్ర‌గ్స్ మొత్తం హైద‌రాబాద్ కేంద్రంగా స‌ర‌ఫ‌రా అవుతున్న గుర్తించారు. దీంతో పోలీసులు, నార్కొటిక్ అధికారులు రంగంలోకి దిగారు. నాచారంలో గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌య‌ర‌వుతున్న కేంద్రంపై దాడులు నిర్వ‌హించారు. దాడుల్లో ఇంకెమ్ కంపెనీనీ సీజ్ చేశారు. అయితే ఈ కేటామిన్ డ్ర‌గ్ కేవ‌లం మ‌త్తుమందు మాత్ర‌మే కాద‌ని.. దీనిని క్ల‌బ్ డ్ర‌గ్‌గా కూడా పిలుస్తార‌ని అధికారులు చెప్పారు. 


కాగా.. గ‌త నెల‌లో బెంగ‌ళూరులోని మెజిస్టిక్ ప్రాంతంలో క‌ర్నాట‌క ఎన్‌సీబీ అధికారులు అనుమానాస్ప‌ద స్థితిలో ఉన్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌ని వ‌ద్ద త‌నిఖీ చేయ‌గా.. బియ్యం బ‌స్తాలో దాచిఉంచిన 26 కిలోల మేర తెల్ల‌టి ప‌దార్థాన్ని గుర్తించారు. అయితే దానిని ప‌రిశీలించ‌గా.. అది నిషేధిత మాద‌క ద్ర‌వ్యం కెటామిన్‌గా తేలింది. ఈ నేప‌థ్యంలో అధికారులు వారి స్టైల్ లో ఆరా తీశారు. దీంతో అస‌లు విష‌యం వెలుగుచూసింది. 


బెంగ‌ళూరులోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో యూనిట్‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో అక్క‌డి మెజిస్టిక్ థియేట‌ర్ స‌మీపంలో ప్ర‌త్యేక అధికారుల బృందం దాడి చేసింది. వారిని గ‌మ‌నించిన వారు అక్క‌డ్నుంచి ప‌రార‌య్యారు. ఒకానొక టైమ్‌లో తన కారులో దూసుకుపోయిన వ్య‌క్తిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఎన్‌సిబీ అధికారుల‌పై దాడికి సైతం వెన‌కాడ‌లేదు. దీంతో కారు నెంబ‌ర్‌ను ట్రేస్ చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఆ త‌ర్వాత ఈ నెల 1వ తేదీన బేంగ‌ళూరులో త‌ప్పించుకున్న వ్య‌క్తిని ఎన్‌సిబీ అధికారులు ప‌ట్టుకున్నారు. అత‌డిని చెన్నైకి చెందిన శివరాజ్ గా గుర్తించారు. 


విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు అత‌డికి బెంగ‌ళూరులోని కెంగేరి, విద్యాన‌గ‌ర్‌లో ఇళ్లున్న‌ట్లు గుర్తించారు. ప‌ట్టుబ‌డ్డ నిందితుడు కెంగేరీలోని త‌న ఇంట్లోనే కెటామిన్ త‌యారు చేస్తున్న‌ట్లు విచార‌ణ‌లో ఒప్పుకున్నాడు. అతడి ఇంటికెళ్లి త‌నిఖీ చేసిన అధికారులు అవాక్క‌య్యారు. అతడి ఇంట్లో కెటామిన్ డ్ర‌గ్ త‌యారి యంత్రం ఉండ‌టాన్ని గుర్తించారు. జనావాసాల మధ్య ఉన్న ఇలాంటి యూనిట్‌ను గుర్తించడం దేశంలో తొలిసారని ఎన్సీబీ అధికారులు పేర్కొంటున్నారు. 


అక్క‌డ్నుంచి సీన్ హైద‌రాబాద్ కేంద్రానికి మారింది. కెటామిన్ డ్ర‌గ్స్ త‌యారీ హైద‌రాబాద్‌లో కూడా జ‌రుగుతున్న‌ట్లు ఎన్‌.సి.బి అధికారులు గుర్తించారు. నిందితుడు శివ‌రాజ్‌కు హైద‌రాబాద్‌లో మ‌రో ఇల్లు కూడా ఉన్న‌ట్లు విచార‌ణ‌లో చెప్పిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో నిందితుడు శివ‌రాజ్ ఇచ్చిన స‌మాచారంతో తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్‌సీబీ సిబ్బందితో నాచారం ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలో దాడులు నిర్వ‌హించారు. దాడుల్లో ఇన్‌కెమ్ ల్యాబొరేట‌రీలో త‌నిఖీలు చేప‌ట్టారు. అక్క‌డ కొంత మ‌త్త ప‌దార్థాన్ని.. ఇంటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బెంగ‌ళూరులో అరెస్ట్ అయిన వ్య‌క్తి ఇంట‌ర్నేష‌నల్ లెవ‌ల్‌లో డ్ర‌గ్స్ ముఠాల‌తో సంబంధాలున్న‌ట్లు గుర్తించారు. 


మొత్త‌మ్మీద నాచారం ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలో ఉన్న ఇంకెమ్ కెమిక‌ల్ ల్యాబ్ పేరుతో వెంక‌టేష్ అనే వ్య‌క్తి ఏకంగా ఒక ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఐదేళ్లుగా గుట్టు చ‌ప్పుడు కాకుండా ఈ దందా కొన‌సాగిస్తున్న‌ట్లు ఎన్‌.సి.బి అధికారుల విచార‌ణ‌లో పేర్కొన్నారు.  సెక్స్‌ డ్రగ్‌గా పేర్కొనే ఈ కెటామిన్‌ మాదకద్రవ్యాన్ని బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక దాని నిర్వాహ‌కుడు వెంక‌టేష్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచార‌ణ కొన‌సాగుతోంది. ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నార‌న్న‌దానిపై కూపీ లాగుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: