దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు విడతల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.  తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..గత నెల 11న ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి.  ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఐదో విడత పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో 7, మధ్యప్రదేశ్ లో 7, బీహార్ లో 5, ఝార్ఖండ్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 2 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఐదో దశ పోలింగ్ లో భాగంగా ఉత్తరాదిలోని 7 రాష్ట్రాల్లో 51 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రముఖులు బరిలో ఉండడంతో పలు నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: