వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేస్తున్నాడు అన్నంతలా ఓ వైపు ఉధ్రుతంగా ప్రచారం సాగుతోంది. మరో వైపు ఓటమి తనదేనని బాబు తనదైన ఆవేశం,అసహనంతో చెప్పకనే చెప్పేసుకుంటున్నారు. మరో వైపు సర్వేలన్నీ జగన్ వైపే ఉన్నాయి. ఇక లగడపాటి సర్వే మాత్రం బాబుకు జై కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ పవర్లోకి  వస్తే అన్న దాని మీదనే గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి.


జగన్ సీఎం అయితే ఆయన క్యాబినేట్లో మంత్రులు ఎవరు అన్న దాని మీద పరిశోధన చేసున్న వారు ఇపుడు ఆయన చెల్లెలు షర్మిల మీద పడ్డారు. అన్న కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న షర్మిలకు ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు అప్పగించాల్సిందేనని పార్టీలో ఓ వర్గం పట్టుపడుతోందట. షర్మిల  ఏకంగా పదిహేను రోజుల పాటు ఈ మధ్య జగన్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బై బై బాబు స్లోగన్ ఆమెదే అది ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిందే.


ఇక అంతకు ముందు జగన్ జైళ్ళో ఉన్నపుడు జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల జనంలోకి వచ్చి 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర అప్పట్లో పార్టీని గట్టిగా నిలబెట్టింది. అంతే కాదు చివరి వరకూ పోరాడి భారీ ప్రతిపక్షంగా వైసీపీ 2014 ఎన్నికల్లో రావడానికి షర్మిల పాదయాత్ర అతి కీలకమని చెప్పాలి. మరి అటువంటి షర్మిలకు జగన్ ఎంతవరకూ న్యాయం చేస్తారు అన్నది ఇపుడు ప్రశ్న.


ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా ఉన్నారు. అలాగే బావ బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కేసీయార్ మంత్రివర్గంలో మేనల్లుడు, కొడుకు కూడా నిన్నటి వరకూ మంత్రులుగా ఉన్న్నారు. రేపటి రోజున మళ్ళీ వారు పదవులు తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు కుమార్తె కవిత కూడా ఎంపీగా ఉంది.  కాబట్టి షర్మిలను ప్రభుత్వ పదవిలోకి జగన్  తీసుకుంటే తప్పులేదని వాదిస్తున్న వారు పార్టీలో ఉన్నారుట. మరి చూడాలి జగన్ గెలిస్తే షర్మిలకు ప్లేస్ ఏంటన్నది తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: