చంద్రబాబు హడావిడి చూస్తుంటే ఉన్న పరువును ఎందుకు పోగొట్టుకుంటున్నాడో అర్ధం కావడం లేదు. చంద్రబాబు ఇప్పుడు పవర్స్ లేని సీఎం దానిని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే వచ్చేవారంలో కేబినెట్ సమావేశం అంటూ గతవారంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కేబినెట్ సమావేశం నిర్వహిస్తా.. అధికారులు ఎలా రారో చూస్తా..' అంటూ చంద్రబాబునాయుడు బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబునాయుడు కేబినెట్ సమావేశానికి ఏర్పాటు చేయాలంటూ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసినంత పనిచేశారు.

అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం జరగుతుందా? జరగదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని అధికారులు ఎన్నికల కమిషన్ కు నివేదించనున్నారని స్పష్టం అవుతోంది. ఏపీ సీఎం కేబినెట్ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారు.. అనుమతిని ఇస్తారా.. అంటూ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించే అవకాశం ఉంది. దానిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా, లేక తమకే తెలియదని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆ లెటర్ ను పంపిస్తుందా అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతుంది.

మామూలుగా అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ కేబినెట్ సమావేశానికి అనుమతి ఉండదు. కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కేబినెట్ సమావేశానికి అవకాశం ఉంటుందని నియమావళి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేబినెట్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని స్పష్టం అవుతోంది. అందుకే ఆయన కావాలని కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడి పంతం నెగ్గుతుందా? లేక ఈ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం బ్రేక్ వేసి బాబు పరువుపోతుందో! 

మరింత సమాచారం తెలుసుకోండి: