ఏపీలో గత నెల జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందా. మొత్తానికి మొత్తం సీట్లు జగన్ కొల్లగొడతారా.  సైలెంట్ వేవ్ వైసీపీ వైపుగా బలంగా వీచిందా. మూడింట రెండు వంతులు సీట్లు పైగా జగన్ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలలో గెలుచుకోబోతున్నారా అంటే కొన్ని జాతీయ సర్వేలు అవుననే అంటున్నాయి. జగన్ ప్రభంజనం బలంగా ఏపీలో ఉందని కూడా గట్టిగా చెబుతున్నారు.


అది ఎంతటి తీవ్రంగా వీచిందంటే అవతల వైపు ఉన్నది చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ దురంధరుడు కాబట్టి నిలబడగలిగారని , మరో పార్టీ అయితే నూటికి నూరు శాతం చేతులెత్తేసేదే అని అంటున్నారు. ఏపీలో జగన్ కి ఈసారి అవకాశం ఇద్దామని జనంలో మార్పు వచ్చిందని, దానికి జగన్ సమ్మోహనశక్తి తోడు అయిందని అది ఓట్ల సునామీగా మారిపోయిందని అంటున్నారు.


అయితే చంద్రబాబు ఇక్కడే తన అనుభవం మొత్తం ఉపయోగించి తట్టుకుని కొంతవరకూ నిలబడ్డారని అంటున్నారు. దానికి టీడీపీకి సంస్థాగతంగా ఉన్న బలం కూడా తోడు అయిందని చెబుతున్నారు. మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ సిస్టం లో ఆరితేరిన బాబు సునామీని కొంత మేర తట్టుకుని పోటీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ విషయాలను బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు డిల్లీలో మీడియా ముందు వెల్లడించారు.


ఏపీలో టీడీపీ పోటీ ఇచ్చిందంటే దానికి బాబు మేనేజ్మెంట్ స్కిల్స్ కారణమని మురళీధరరావు అన్నారు. జాతీయ సర్వేలు ఇదే చెప్పాయని కూడా ఆయన పేర్కొన్నారు. మరి బాబు తన అనుభవాన్ని అంతా రంగరించి  నడిపించిన ఈ ఎన్నికలు ఆయనకు ఎన్ని సీట్లు తెచ్చిపెడతాయో చూడాలి. అలాగే జగన్ సునామీ కనుక ఉంటే లాండ్ సైడ్ విక్టరీకి వైసీపీ రెడీ ఐపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: