నాకు ఎప్పుడో ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చింది.. కానీ నా దృష్టి అంతా రాష్ట్రం మీదే.. అందుకే ఆ అవకాశం వద్దనుకున్నా.. ఇప్పటికీ నాది అదే మాట. నా దృష్టి అంతా ఏపీపైనే.. నేను ప్రధానమంత్రి పదవి రేసులో లేను.. ఇవీ పీఎం పోస్టు అవకాశాలపై చంద్రబాబు తరచూ చెప్పే మాటలు.


కానీ.. అసలు చంద్రబాబుకు ప్రధాని పదవి వచ్చే అవకాశం ఉందా.. కేవలం 25 ఎంపీ సీట్లు ఉన్న ఓ రాష్ట్రం నుంచి ప్రధాని అవగలరా.. 80, 46, 40 ఎంపీ సీట్లు ఉన్న యూపీ, మహారాష్ట్ర, బెంగాల్ వంటి రాష్ట్రాలను కాదని ఏపీకి ప్రధాన మంత్రి పదవి అందుకునే అవకాశం ఉంటుందా.. ఇవన్నీ సహేతుకమైన అనుమానాలే. 

కేంద్రంలో నరేంద్ర మోదీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడి... ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంటే ప్రధాని పీఠం టీడీపీ అధినేత చంద్రబాబుకి దక్కే అవకాశం ఉంది. ఇవి మా మాటలు కాదు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ. ఎందుకంటే.. మోదీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చెయ్యడంలో, మోదీని వ్యతిరేకించడంలో మమతా బెనర్జీ, మాయావతి కంటే చంద్రబాబే ముందు ఉన్నారని ఆయన చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి పది కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కితే, చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే అలాంటి అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా.. ఎక్కుువ ఎంపీ సీట్లు ఉన్న మమత, మాయావతి వంటి వారు చంద్రబాబుకు అవకాశం కల్పిస్తారా అన్నది అనుమామే. ఏమో గుర్రం ఎగురావచ్చు.. చంద్రబాబు ప్రధానికానూవచ్చు. ఏమంటారు..? 



మరింత సమాచారం తెలుసుకోండి: