మే 23న వెలువ‌డ‌బోయే అసెంబ్లీ ఫ‌లితాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌శ‌ను మార్చ‌డ‌మే కాకుండా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌త్‌ను సైతం స‌మూలంగా మార్చివేస్తాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి కీల‌క‌మైన ఫ‌లితాల‌పై అందుకే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎంతో ఆస‌క్తి ఉంది. అయితే, ఈ ఉత్కంఠ ప్ర‌భుత్వ అధికారుల్లోనూ ఉంద‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వంలో కొంద‌రు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప‌నిచేశార‌నే ఆరోప‌ణ‌లు వైసీపీ చేసింది. మ‌రోవైపు కొంద‌రు అధికారులు టీడీపీ నేత‌ల తీరు న‌చ్చ‌క కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోయారు.


టీడీపీ పాల‌న న‌చ్చ‌క వెళ్లిన వారితో పాటుగా మ‌రికొంద‌రు జాతీయ స‌ర్వీసుల్లో ఉన్న‌వారు సైతం తినిగి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాట ప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొంద‌రి పేర్ల‌ను మీడియా ప్ర‌చారంలో ఉంచింది. ఇలా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న వారిలో విజ‌య‌వాడ పోలీస్‌ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన  సీతారామాంజ‌నేయులు ఒక‌రు. ప్ర‌స్తుతం బీఎస్ఎఫ్‌లో ప‌నిచేస్తున్నార రామాంజ‌నేయులు 2015లో కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోయారు. టీడీపీ తీరును నిర‌సిస్తూ రాష్ట్రానికి గుడ్‌బై చెప్పిన ఆయ‌న ఒక‌వేళ‌, తిరిగి ఏపీ క్యాడ‌ర్‌కు వ‌స్తే వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుందని క‌థ‌నాలు వ‌స్తున్నారు. 


సీతారామాంజ‌నేయులుతో పాటుగా ప‌లువురు కీల‌క అధికారుల పేర్లు రాష్ట్రానికి తిరిగి వ‌చ్చే అధికారుల జాబితాలో వినిపిస్తున్నాయి. బ్యూరో ఆఫ్‌ పోలీస్ ఆండ్ డీలో ప‌నిచేస్తున్న మ‌నీష్‌కుమార్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ స్పెస‌ల్‌ డీజీ వీఎస్‌కే కౌముదీ, నేష‌న‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యురిటీ డీజీ అంజ‌నా సిన్హా,  నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో ప‌నిచేస్తున్న మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఇండియ‌న్ డిఫెన్స్ ఎస్టేట్ స‌ర్వీస్‌లో ప‌నిచేస్తున్న ధ‌ర్మారెడ్డి తిరిగి ఏపీకి రానున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఈ అధికారులు రాష్ట్రం బాట ప‌డ‌తార‌ని అంటున్నారు. మే 23న వ‌చ్చే ఫ‌లితాల‌ను బ‌ట్టి ఈ అధికారులు రాష్ట్రానికి వ‌చ్చే ముడిప‌డి ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: