ఈ సారి ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసన సభ ఎన్నికలు వాడీ వేడిగా జరిగాయి(రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,మిజోరం,తెలంగాణ) ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలుండగా 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఊహించినట్టే కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది.


ముఖ్యమంత్రి వసుంధరా రాజే (బీజేపీ) ఝాలార్‌పాటన్ స్థానం నుంచి గెలిచారు. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్-బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.
కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ మాత్రం ఆ పార్టీకి రాలేదు.
బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపొందారు.ఛత్తీస్‌గఢ్‌‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. మొత్తం 90 స్థానాలకు 68 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది.


బీజేపీ 15 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమన్ సింగ్ రాజ్‌నాంద్‌గాం స్థానంలో మొదట్లో వెనుకంజలో ఉన్నా ఆఖరికి గెలిచారు.మిజోరంలో అధికార పార్టీ కాంగ్రెస్ కు ఈ సారి ఎదురుగాలి తప్పలేదు. ప్రతిపక్షపార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగులేని విజయం సాధించింది.
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయఢంకా మోగించింది.



కాంగ్రెస్ పార్టీ కేవలం 05 స్థానాలకే పరిమితం అయ్యింది.తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 119 స్థానాల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 21 సీట్లతో ప్రజాకూటమి ప్రతిపక్షానికి పరిమితమైంది. బీజేపీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోగా, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం దేశంలో ఐదు విడుతల పోలింగ్ జరిగింది.  ఫలితాలు కోసం అధినేతలు ఎదురు చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: