ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అంతా ఊహాగానమే జరుగుతుంది. టీడీపీ, వైసీపీ తామే అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెబుతున్నాయి. జనసేన కూడా తామదే అధికారం అంటోంది. చాలామంది మాత్రం జనసేనకు అంత సీన్ లేదంటున్నారు. 


ఐతే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో జనసేన పార్టీ టీడీపీ, వైసీపీలకు గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవం. కృష్ణా, గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాల్లోనూ ఆ పార్టీకి మంచి బేస్ ఉంది. సీట్లు గెలిచినా గెలవకపోయినా కనీసం 30వేలు ఓట్లు తెచ్చుకునే సత్తా ఉంది. 

మరి ఇప్పుడు ఏపీలో హంగ్ వస్తే పవన్ కల్యాణ్ ఏం చేస్తారు.. ఎవరికి మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్ సాగుతోంది. టీడీపీ, వైసీపీలకు చెరో 70 సీట్లు వచ్చి.. జనసేనకు 30 వరకూ వస్తే పవన్ కల్యాణ్ ఏంచేస్తారు.. ఎవరికి మద్దతు ఇస్తారు.. 

ఉభయగోదావరి జిల్లాల్లో ఈ అంశపైనా పందేలు సాగుతున్నాయట. ఈపందెం వేసేవారిలో పవన్ చంద్రబాబుకే సపోర్ట్ చేస్తాడని 95 శాతం మంది బెట్టింగ్ కడుతున్నారట. పవన్ , జగన్ కు మద్దతిస్తారని కేవలం 5 శాతం మంది మాత్రమే బెట్టింగ్ వేస్తున్నారట. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: