టీవీ9 రవిప్రకాష్ గురించి చాలా మందికే తెలుసు. అయితే ఇప్పుడు ఇతను పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. టీవీ 9 నూతన యాజమాన్యంలో భాగం అయిన అలంద మీడియా అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా... రవిప్రకాష్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా రవిప్రకాష్ ను పట్టుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని సమాచారం.


రవిప్రకాష్ కోసం టీవీ 9 ఆఫీసులో, ఆయన ఇంట్లో సోదాలు జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే రవిప్రకాష్ దేశం దాటారని.. ఆయన విదేశాల్లో ఉన్నాడని ప్రచారం జరుగుతూ ఉంది. టీవీ 9 నుంచి నిధులను అక్రమంగా వేరే సంస్థకు తరలించడం, చానల్ లో కొన్ని నియామకాల విషయంలో సంతకాలను ఫోర్జరీ చేయడం అనే అంశాలపై రవి ప్రకాష్ పై అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.


ఈ ఫిర్యాదుపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారని, విచారించడానికి రవిప్రకాష్ కు నోటీసులు జారీచేయగా.. ఆయన అందుబాటులో లేనట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనను పట్టుకోవడానికి టీవీ నైన్ ఆఫీసులో, ఆయన ఇంట్లో సోదాలు జరగుతున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది ఈ వ్యవహారం!

మరింత సమాచారం తెలుసుకోండి: