సచివాలయం అంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి గుండెకాయ లాంటిది. అంటే ప్రభుత్వంలో సచివాలయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి సచివాలయంలో పనిచేసే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో మెజారిటీ జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా నిలబడ్డారట. పోలింగ్ తర్వాత ఉన్నతాధికారుల్లో చాలామంది సచివాలయం నుండి జిల్లాల స్ధాయి వరకూ రెండుగా చీలిపోయారట. అందులో మెజారిటీ వైసిపికి మద్దతుగా నిలిచిరని చంద్రబాబు మీడియా స్పష్టంగా చెప్పేసింది.

 

పోలింగ్ జరిగిన తర్వాత నుండి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనే విషయంలో అధికార యంత్రాంగం మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. పోలింగ్ సరళిని గమనించిన తర్వాత వివిధ మార్గాల్లో వివరాలు తెప్పించుకున్న ఐఏఎస్ ల్లో ఎక్కువమంది కాబోయే సిఎం జగనే అని నిర్ణయించుకున్నారట. అందుకే ఇపుడు జగన్ క్యాంపుకు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని సదరు పత్రికే చెప్పటం గమనార్హం.

 

టిడిపినే మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కొందరిలో ఉన్నప్పటికీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువట. అందుకే వాళ్ళెవరూ ఇపుడు ఎటువంటి చర్చల్లోను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయటం లేదట. మరికొందరు ముందు జాగ్రత్తగా టిడిపి గట్టునుండి వైసిపి గట్టువైపుకు దూకేస్తున్నారట. సరే రెండు గట్లకు సమాన దూరంలో ఉన్నవారు కూడా కొందరున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని మీడియా చెప్పటం గమనార్హం.

 

గడచిన ఐదేళ్ళల్లో ఎన్నో కీలక హోదాల్లో పనిచేసిన వారు కూడా ప్రస్తుతం వైసిపి వైపు వెళ్ళిపోయారట. అందులో కొందరైతే వైసిపి ప్రకటించిన కొన్ని పథకాల రూపకల్పనలో భాగస్ధులైనట్లు కూడా మీడయా చెబుతోంది. అంటే ప్రభుత్వంలోని కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ ల్లో కొందరు వైసిపి బలోపేతానికి పనిచేశారన్నది పత్రిక చెప్పదలుచుకున్న విషయం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: