టీవీ9 సీఈవో రవి ప్రకాష్ నివాసం, కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు కలకలం రేపాయి. టీవీ9కు చెందిన  కేసు విషయంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవిప్రకాష్ అడ్డు తగులుతున్నారని ఆరోపించారట.


దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో, రవి ప్రకాష్, తదితరులపై 406,467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి అలంద మీడియా టీవీ9ను టేకోవర్ చేసిందట.   
CEO Ravi prakash sacked from TV9 forgery case registered
టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ ను తొలగించింది యాజమాన్యం, సంతకం ఫోర్జరీ ఆరోపణలతో టీవీ9 యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో 91 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్‌ అడ్డుతగులుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కాగా, రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలందా మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72  కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 


టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియాకు టీవీ9ను అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి రవిప్రకాష్‌ అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9 లో 91 శాతానికి పైగా అలందా మీడియాకు వాటా ఉండగా, రవిప్రకాష్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


మరోవైపు తనకు 40000 షేర్లు టీవీ9 లో ఉన్నాయని, తనకు తెలియకుండా అలందాకు విక్రయించారని శివాజీ ఆరోపించారు. అయితే, రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డు కుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అలందా డైరెక్టర్ కౌశిక్ రావు. ఇక టీవీ9 ఆఫీసు, సీఈవోగా  పనిచేసిన రవిప్రకాష్‌ నివాసంతో పాటు, హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. 


ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా పోలీసులు తన సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి నాలుగు ప్రత్యేక బృందాలు సోదాలు కొనసాగిస్తు న్నాయి. ఓవైపు పోలీసుల సోదాలు కొనసాగుతోన్న సమయంలోనే టీవీ9 యాజమాన్యం, రవిప్రకాష్‌ ను సీఈవో పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Image result for cine actor sivaji

అలాగే టీవీ9లో తనకు వాటా ఉందంటూ  నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించిన నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. కాగా సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి, కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవిప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్య మైన డాటాను తస్కరించడమేకాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

Image

అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్‌ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)ని ఆశ్రయించారు. శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం.  ఏబీసీఎల్‌ లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందు కు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20,  2018న  ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: