రవి ప్రకాష్ ఉదాంతం పై విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారింది. వీళ్ల బారినుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుంది. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆతర్వాత బ్లాక్ మెయిలర్లు - కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లింది. రవిప్రకాష్ సృష్టించిన గరుడ పురాణం శివాజి కూడా టివీ9 కేసుల్లో ఇరుక్కున్నాడు.


రవిప్రకాష్ తనకు కొన్ని షేర్లు అమ్మి మోసం చేశాడని ఈ బ్రోకర్ ట్రిబ్యునల్ కు వెళ్ళాడు. దీని వెనక రవిప్రకాష్ ఉన్నాడు. TV9 బోర్డులోకి కొత్త యాజమాన్యం ప్రతినిధులు రాకుండా ఆఖరి నిమిషంలో ఆడిన నాటకం. సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలి. అమరావతిలో భూముల కొనుగోళ్లు - హైదరాబాద్ లో ఆస్తులు ఎలా కొన్నాడు?  శివాజి గరుడ పురాణం ఒక కుట్ర. శివాజి టివి9 ఆఫీసులో ఏం చేస్తుంటాడో విచారణ జరగాలి. 


సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలి. అమరావతిలో భూముల కొనుగోళ్లు - హైదరాబాద్ లో ఆస్తులు ఎలా కొన్నాడు?  శివాజి గరుడ పురాణం ఒక కుట్ర. శివాజి టివి9 ఆఫీసులో ఏం చేస్తుంటాడో విచారణ జరగాలి.  ఆ చనువుతోనే  స్మగ్లర్లు టివీ9 మీడియా స్కిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్ర చందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడ ఉండటం దారుణం.

మరింత సమాచారం తెలుసుకోండి: