మే 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్నందున ఎన్నికల సంఘం అందుకు సిద్ధమవుతోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ప్రత్యేకంగా వీవీప్యాట్ లను కూడా ఉపయోగించినందువల్ల అందుకు తగినట్టుగా ఓట్ల లెక్కింపుకు తగిన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  


ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, కౌంటింగ్‌ ఎఆర్‌ఒ లు ఇతర సంబంధిత ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు  శిక్షణా కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు. 

కౌంటింగ్‌ కేంద్రాల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని కలెక్టర్లు ఎలక్షన్ సెల్ అధికారులకు సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు అవసరమైన టేబుల్స్‌ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది.

కౌంటింగ్ ఎలా జరుగుతుందంటే..  పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను రిటర్నింగ్ అధికారి లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. నిబంధన 52 ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: