సంచ‌ల‌న సృష్టిస్తున్న టీవీ9 వివాదం మ‌లుపులు తిరుగుతోంది. టీవీ9ను కొనుగోలు చేసిన అలంద మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని  అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. టీవీ9లో 90 శాతానికి పైగా అలంద మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ వివాదం మ‌లుపులు తిరుగుతోంది.


అలంద మీడియా ఫిర్యాదు నేప‌థ్యంలో, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌, హీరో శివాజీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రవిప్రకాష్‌ ఇంటికి  వెళ్లిన పోలీసుల బృందం.. ఆయన అందుబాటులో లేకపోవడంతో రవి ప్రకాష్ భార్యకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు. రేపు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, శివాజీ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. 


శుక్ర‌వారం టీవీ9 కార్యాలయంలో రవిప్రకాశ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన్న విచారిస్తున్నారు. రవిప్రకాశ్ తోపాటు శివాజీ, మూర్తిలకు నోటీసులు అందజేశారు. శుక్రవారం  ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు అందజేసిన‌ప్ప‌టికీ ఆయ‌న హాజ‌రు హాజ‌రుకాక‌పోవ‌డం వెనుక ఆంధ్రప్ర‌దేశ్‌లోని ఓ ప్ర‌ధాన పార్టీ మ‌ద్ద‌తు ఉందంటున్నారు. వివాదాన్ని మ‌రింత ముదిరేలా చేసేందుకే  త‌ర‌చుగా తమ‌ పార్టీకి మ‌ద్ద‌తుగా మాట్లాడే శివాజీని ఈ విధంగా `బ్రీఫ్‌` చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: