ఎవరు అవునన్నా కాదన్నా .. ఆంధ్రలో ఇప్పటివరకు ప్రత్యేక హోదా అనే అంశం ఉందంటే దానికి కారణం జగన్ అని చెప్పడంలో ఎటువంటు అతిశయెక్తి లేదు. అయితే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే జగన్ కు కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం కలదు.  ఎన్డీయేకి వ్యతిరేకి కాదు - యూపీఏకి అనుకూలుడు కాదు.. ఇదీ ఇప్పుడు జగన్ ఇమేజ్. మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలు కూడా వన్ సైడెడ్ గా ఉండవు అని స్పష్టం అవుతోంది.


బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినంత స్థాయిలో సీట్లు రావు. అలాగని చిత్తు అయిపోదు.ఎన్డీయే రూపంలో బీజేపీ మినిమం మెజారిటీకి దగ్గర దగ్గర గా రావొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. అప్పుడు మరి కొన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీ కలుపుకుని పోవాల్సిందే!కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు అదే! సొంతం గా అధికారంలోకి కల్ల. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుంటే.. అది అధికారానికి దగ్గరగా వెళ్లగలదు. అలాంటి సందర్భంలో వైఎస్ జగన్ వంటి వారి మద్దతు అత్యంత కీలకం అయ్యే అవకాశం ఉంది.


ఈ సందర్భంలో కేంద్రంలో మద్దతు విషయంలో జగన్ ఒకే అంశాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖాయంగా ఇచ్చే వారికి దాన్ని అనౌన్స్ చేసే వారికే జగన్ మద్దతును ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది. కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కని పరిస్థితి తలెత్తేలా ఉన్న నేపథ్యంలో.. జగన్ తనకు దక్కే ఎంపీ సీట్ల ద్వారా ముందుగా తన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సంపాదించి.. తన సమర్థతను - చాతుర్యాన్ని చాటుకోవచ్చు. ఐదేళ్లల్లో టీడీపీ వల్ల కానిది జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సాధిస్తే జగన్ హీరో అవ్వటం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: