ఏపీలో గత ఎన్నికల జరిగిన ఎన్నికల సందర్భంగా విపరీతమైన ప్రచారం జరిగింది. ఓ వైపు టీడీపీ, మరో వైపు వైసీపీ  యమ జోరుగా ప్రచారం చేసాయి. ఇక ఈసారి ప్రచారంలో చంద్రబాబు హైలెట్స్ ఎన్నో ఉన్నాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన మాట తీరు కూడా వేరేగా ఉంది. మొత్తానికి ప్రచారంలోనే అన్ని రకాలైన  పదనిసలు బాబు వినిపించారు.


ఈసారి ప్రచారంలో చంద్రబాబు  జనాలకు వంగివంగి దండాలు పెడుతూ అలా ముందుకు సాగిపోయారు. ఒక చోట అనుకుంటే కాదు, అన్ని మీటింగుల్లో ఇదే బాబు గారి స్టైల్. ప్రసంగం  మొత్తం పూర్తి అయిన తరువాత ఇంత పొడుగు మనిషీ సగానికి సగం వంగిపోయి మరీ జనాన్ని ఓట్లు వేయమని ప్రాధెయపడ్డారు. దాని మీద అప్పట్లోనే సెటైర్లు పడ్డాయి. బాబు ఎందుకిలా వంగి దండాలు పెడుతున్నారంటూ చర్చలూ సాగాయి.


అయితే దీనికి సమాధానం ఈ రోజు పార్టీ సమీక్షా సమావేశంలో బాబు గారే ఇచ్చారు. తాను గతంలో లేని విధంగా ఎందుకింతలా వంగానంటే ఏపీ దుర్మార్గుల చేతుల్లోకి పోరాదని, ప్రజలు టీడీపీకే ఓటు వేసి రాష్ట్రాన్ని అభివ్రుధ్ధిలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ప్రాధేయపడ్డాను తప్ప తన స్వార్ధం కోసం కాదని వివరించుకున్నారు. 
టీడీపీ గెలవడం ప్రజల అవసరం కాబట్టే తాను అలా చేశానని కూడా బాబు చెప్పుకున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ వైసీపీ జోరుని చూసి బాబు జనాలకు వంగి దండాలు పెట్టారని సోషల్ మీడియా అంతా సెటైర్లు వేస్తే బాబు గారు మాత్రం ఏపీ కోసమే అలా వంగానని అంటున్నారు. మరి బాబు గారి వంగినదానికి ప‌లితం ఏమైనా వచ్చిందా అన్నది ఈ నెల 23న తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: