ఈ దఫా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ గెలుస్తాడా .. లేదా ఓడిపోతాడా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటికే సీఎం వద్దకు చేరాయా..? ఈ విషయాన్ని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న లోకేష్.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు.


ఇందుకోసం ఆయన చాలా రోజుల క్రితం తన ఓటు హక్కును అక్కడ నమోదు కూడా చేయించుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడింది. మంగళగిరి నుంచి లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారనేదే ఈ వార్త సారాంశం. అన్ని జిల్లాల్లో ఓటింగ్ సరళిపై చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


అయితే తన కుమారుడు స్థానం కావడంతో పాటు వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తుండడం రాజధానికి ముఖ ద్వారంగా చెప్పుకునే నియోజకవర్గం కావడంతో మంగళగిరిపై ఆయన ఇప్పటికే ప్రత్యేకంగా రివ్యూ చేశారని తెలిసింది. గతంలో నియమించిన బూత్ కన్వీనర్లు పోలింగ్ ఏజెంట్లు ఇతర టీడీపీ నాయకుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించిన టీడీపీ అధినేత ఈ ఎన్నికల్లో లోకేష్ ఘన విజయం సాధించబోతున్నారని తేల్చేశారనే టాక్ వినిపిస్తోంది. మరీ ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: