టీవీ 9 రవిప్రకాష్ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఇన్ని రోజులు తెర వెనుక నడిపించిన చీకటి పనులు ఇప్పుడు బయటికొచ్చి నడి రోడ్లో నిలబెట్టాయి. చేస్తున్న ఈ చెత్తపని అంతా 'మెరుగైన సమాజం' కోసం అంటూ చెప్పుకోవడం. మరి అలాంటి మెరుగైన సామాజాలా కోసం ప్రయత్నించే సంస్థకు సీఈవోగా వ్యవహరించిన వ్యక్తి మురుగు స్వరూపం ఎలా ఉంటుందో బట్టబయలు అయ్యింది!


అతిగా నీతులు చెప్పేవాడి అసలు స్వరూపం ఫోర్జరీ అని, అతడో ఫోర్‌ ట్వంటీ అని తేలింది. తను పనిచేస్తున్న సంస్థలో కొంత షేర్‌ను సంపాదించుకుని.. ఆ సంస్థ జుట్టును తన చేతిలో ఇరికించుకోవాలని సదరు నీతిమంతుడు ప్రయత్నించాడు. తన పథకం పారడం కోసం ఫోర్జరీకి కూడా వెనుకంజ వేయలేదని అతడి బాధితులు వాపోతూ ఉన్నారు. ఈ అంశంలో వారు సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. అతడి మీద ఫోర్‌ ట్వింటీ సెక్షన్‌ కింద కేసు నమోదు అయ్యింది.


అంతకన్నా తీవ్రమైన అభియోగాలు కూడా నమోదయ్యాయి. అవి నిధుల బదలాయింపుకు సంబంధించినవి. కేవలం ఎనిమిది శాతం వాటాను కలిగి ఒక సంస్థ అంతా తనదే అన్నట్టుగా అతడు చేసిన దందాలు ఎన్నో ఉన్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి కూడా బయటకు వచ్చే అవకాశాలుంటాయి. ఎంతోమందిపై అనుచితమైన కథనాలతో వారి బతుకులను బజారుకు ఈడ్చినవారు ఇప్పుడు గురించి ఇతర చానళ్ల కవరేజీని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. నొప్పి ఏమిటో ఇప్పుడు తెలుస్తోందా?

మరింత సమాచారం తెలుసుకోండి: