ఏపీలో మెజారిటీ మీడియా ఎవరి చేతుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికార పార్టీ టీడీపీకి కొమ్ము కాయడం తెలుగు మీడియా పని అని చెప్పొచ్చు. రెండు పెద్ద పత్రికలు ఇంకా అనేక టీవీ వార్తా చానళ్లు జగన్ ను లక్ష్యంగా చేసుకొంటూ సాగుతున్నాయి. అలా మీడియా తననే లక్ష్యంగా చేసుకున్నా తట్టుకుంటూ వచ్చాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తి అయ్యింది.ఇక ఫలితాల కోసం వేచి ఉన్నారంతా.


విజయం వైఎస్సార్సీపీనే వరిస్తుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. తమ మీడియా బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఉందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందు కోసం ఒక చానల్ ను టేకోవర్ చేయడంతో పాటు మరో చానల్ ను స్థాపించే ఉద్దేశంలో ఉందట. ఆ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఈ పనిలో ఉన్నట్టుగా సమాచారం.ఇన్ని రోజులూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నిర్వహించిన రాజ్ న్యూస్ చానల్ ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టేకోవర్ చేస్తున్నారనే ప్రచారం సాగుతూ ఉంది.


దాంతో పాటు మరో చానల్ ను స్థాపించే ఉద్దేశం కూడా ఉందట. అది అటు వార్తలు ఇటు ఎంటర్ టైన్ మెంట్.. రెండింటినీ మేనేజ్ చేస్తూ సాగుతుందని సమాచారం.ఇప్పటికే ఉన్న 'సాక్షి' కి తోడు ఈ రెండు మీడియా వర్గాల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మీడియా బలాన్ని పెంచుకోవాలని భావిస్తోందని విజయసాయి రెడ్డి ఇందుకు సంబంధించిన కసరత్తును సాగిస్తున్నట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: