ప్ర‌జాద‌ర్బార్‌.. ఈ పేరులోనే ఉన్న‌ట్టుగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం, వారి క‌ష్టాలు తెలుసుకోవ‌డం ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం. నిజానికి ద‌ర్బార్ అంటేనే ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనే వేదిక‌. ఇలాంటివి సాధార‌ణంగా రాష్ట్రంలో జ‌ర‌గ‌డం అరుదు. ముఖ్యంగా టీడీపీ ప్ర‌భుత్వంలో ఇలాంటి మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌వు, వినిపించ‌వు కూడా. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఆయ‌న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో 2004లో నిర్వ‌హించి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను, వారు చెప్పిన స‌మ‌స్య‌ల‌ను కొన్నింటిని అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక‌, వైఎస్ వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన వైఎస్ జ‌గ‌న్‌.. త‌ర‌చుగా ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హిస్తున్నారు. 

అయితే, ఆయ‌న ఈ ద‌ర్బార్‌ను త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం. 2014 ఎన్నిక ల్లో పులివెందుల నుంచి విజ‌యం సాధించిన జ‌గ‌న్‌.. 2015, 2016లో రెండు సార్లు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప్ర‌జాద‌ర్భార్ లు నిర్వ‌హించారు. రెండు రోజులు నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లంద‌రినీ ఆహ్వానిస్తారు. పులివెందు ల‌లోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించే ఈ ప్ర‌జాద‌ర్బార్‌కు  నియోజ‌క‌వ‌ర్గంలోని  సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే వారికి భోజ‌న స‌దుపాయం కూడాఏర్పాటు చేస్తారు. ఇక‌, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని, వాటి ప‌రిష్కారినికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింప‌డం ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం. 

ఇక‌, తాజాగా ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు జ‌గ‌న్ మ‌రోసారి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప్ర‌జా ద‌ర్బార్‌ను ఈ నెల 15, 16 తేదీల్లో అంటే బుధ గురువారాల్లో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన ఫ‌ణి తుఫాను ప్ర‌భావంతో కురిసిన భారీ వ‌ర్షాలు, ఈదురుగాలుల‌తో క‌డ‌ప‌లో భారీ ఎత్తున రైతులు వివిధ పంట‌ల‌ను న‌ష్ట‌పోయారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఇక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం కూడా వేడెక్కింది.దీంతో ఆయా అంశాల‌పై స్థానిక నేత‌ల‌తోనూ చ‌ర్చించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. అదేవిధంగా రైతుల‌కు అందించాల్సిన న‌ష్ట‌ప‌రిహారంపై ఎమ్మెల్యేగా ఆయ‌న నోట్‌ను త‌యారు చేసి సీఎస్‌కు పంపాల్సి ఉంది. ఈ కార‌ణాల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌జాద‌ర్బార్‌కుతెర‌దీసిన‌ట్టు స‌మ‌చారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: