వైసీపీ అధినేత జగన్ గెలుపు ధీమాలో ఉన్నారు. ఆరు నూరు అయినా ఈసారి అధికారం తనకు తప్పనిసరిగా లభిస్తుందని ఆయన గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఫలితాలు రావడం ఇక  లాంచనమని భావిస్తున్నారు. అందువల్ల విలువైన కాలాన్ని ఆయన రాబోయో కాలంలో పరిపాలన ఎలా చేయాలన్నదాని మీద ద్రుష్టి పెట్టారని అంటున్నారు.



జగన్ అధికారంలోకి వస్తే మూడు ప్రధాన రంగాల మీద ఆయన టార్గెట్ ఉంటుందని అంటున్నారు. అందులో మొదటిది అందరికీ విద్యను అందించడం. వైఎస్సార్ కూడా ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ పెట్టి అందరికీ చదువు అందేలా చూశారు. జగన్ ఈ విషయంలో మరింత కసరత్తు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటున్నారట. అలాగే అందరికీ ఆరోగ్యం. ఇది కూడా వైఎస్ నాటి స్కీమ్  గానే ఉంటుంది. ఆరోగ్య‌శ్రీ కి మెరుగులు దిద్ది మరింతగా జనంలోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారుట.


దీని వల్ల నిరుపేదలకు ఆరోగ్యం బాగుపడుతుందని జగన్ అనుకుంటున్నారుట. ఇక మూడవది వ్యవసాయ రంగం. ఇది చాలా కీలకమైన రంగంగా జగన్ భావిస్తున్నారుట. రైతులకు మంచి జీవితం ఇవ్వడంతో పాటు, వ్యవసాయం పండుగ చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ అంశాల మీద  ఇపుడు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుగుతున్నారని అంటున్నారు. మొత్తానికి తనదైన పాలన జనంలో గుర్తుండే విధంగా పది కాలాల పాటు చెప్పుకునేలా  ఉండాలని జగన్ భావిస్తున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: