జాక్ మా తెలుసు కదా.. ఈ కామర్స్ సైట్ అలీబాబా సీఈవో.. ఈయన ఈ వెబ్ సైట్‌తో వేల కోట్లు సంపాదించేశాడు.. ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. ఆయన ఇటీవల పని గంటల విషయంలో చేసిన ఓ ప్రతిపాదన చాలా వివాదాస్పదం అయ్యింది. 


ప్రతి ఉద్యోగీ.. వారానికి ఆరు రోజులు.. ప్రతీ రోజు 12గంటలు పనిచేయాలని రూల్ పెట్టారు. ప్రపంచమంతా  రోజులు ఎనిమిది గంటల పని ఉంటే.. ఆయన 12 గంటలు చేయమన్నాడు. దానికి 996 అంటూ పేరు పెట్టాడు. అంటే నైన్‌ టు నైన్‌.. వీక్లీ 6 డేస్ అని అర్థం.. 

ఇప్పుడు అదే వ్యక్తి ఇంకో కొత్తప్రతిపాదన చేశాడు. వ్యక్తిగత జీవితంలో 'వారానికి ఆరు రోజులు, ఆరుసార్లు శృంగారం.. ఎంతసేపు చేశామన్నది ముఖ్యం.. అంటూ సంచలన ప్రతిపాదన చేశాడు.  వినడానికి బాగానే ఉన్నా.. రోజుకు పన్నెండు గంటలు పని చేసేవాడు.. ఇంటికొచ్చి ఇక శృంగారం ఏం చేస్తాడంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

అంతేకాదు.. జాక్ మా ఇంకో విషయం కూడా ఆసక్తిగా చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఫేకే అంటున్నారు.. సంపాదన.. ఆస్తులు.. పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఫేక్ అంటున్నారు. వీటి కోసం జనం తాపత్రయపడతారని.. కానీ ఈ ప్రపంచంలో అసలైన ఆస్తి పిల్లలే అని అంటున్నాడు జాక్ మా. అందుకే వీలైనంత మంది పిల్లలను కనాలంటున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: