చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారన్నది అందరికీ తెలిసిందే. ఆయనకు మద్దతుగా ఆనాడు బలమైన మీడియా వ్యవస్థ పనిచేసింది. బాబుకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అప్పట్లో లీడింగ్ పేపర్లు కొన్ని బాబుకు వత్తాసు పలికి మరీ ఆయన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాయి.


ఆ తరువాత బాబు ఇప్పటికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరో వారంలో ఎన్నికల ఫలితాలు రాబోతున్న తరుణంలో ఈ రోజు హఠాత్తుగా చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ కి హెలికాప్టర్ ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి మరీ రామోజీని కలుస్తున్నారు. మరి మీడియా మొఘల్ తో బాబు ఏం చర్చలు జరుపుతున్నారన్నది  ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది.


చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తారో లేదో అన్న సందేహం ఏపీ రాజకీయాల్లో ఉంది. బాబు పార్టీకి ఈసారి పరాజయమేనని సర్వేలు గొంతు చించుకుంటున్న వేళ రాజ గురువు సలహా సంప్రదింపుల కోసం బాబు ఆయన్ని కలుస్తున్నారా అన్నది అనుమానాలు వస్తున్నాయి. ఇక మరో వైపు బీజేపీ పెద్దలతో కూడా రామోజీరావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల అటు వైపు నుంచి లేక ఇటు వైపు నుంచి రాయబేరాలు మొదలవుతున్నాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు రామోజీల భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లొ అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ గానే చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: