కాంగ్రెస్ పార్టీ జగన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టింది. చేతిలో వైఎస్సార్ తెచ్చి పెట్టిన అధికారం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అనుభవిస్తూ మరీ జగన్ మీద కక్షకట్టింది హస్తం పార్టీ, తమ మాట వినకుండా కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చినందుకు పదహారు నెలల పాటు జైళ్ళో కూర్చోబెట్టింది. ఆయన ఆస్తులపైన దాడులు చేయించింది.  సీబీఐని ఉసిగొలిపి మరీ జగన్ తో ఆ డేంజరస్ గేం ఆడింది.


చివరికి జగన్ పదేళ్ళుగా రోడ్డున పడాల్సివచ్చింది. ఆయన తన సొంత రాజకీయం చేసుకుంటున్నా కాంగ్రెస్ కి మంటగా ఉండేది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో ఓడిపోవడంతో జగన్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. జగన్ని తక్కువ అంచనా వేసినందుకు కాంగ్రెస్ కూడా తగిన శిక్షను అధికారం కోల్పోవడం ద్వారా అనుభవించింది. సరే అయిదేళ్ళు గడచిపోయాయి. 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారం పోగొట్టుకున్న జగన్ ఇపుడు అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పగలుగుతున్నారు. అన్ని రకాల సర్వేలు జగన్ కి ఏపీలో వేవ్ ఉందని చెప్పేశాయి.


ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధి నేరుగా జగన్, కేసీయార్ వంటి వారికి లేఖలు రాసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ప్రతిపక్షాలు డిల్లీలో  సమావేశమవుతున్నాయి. సోనియా గాంధి అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు జగన్ కి ఇన్విటేషన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అది కూడా సోనియా గాంధీ నుంచి నేరుగా లేఖ రావడం అంటే రాజకీయాలు పదేళ్ళలో ఎలా మారాయన్నది అర్ధమవుతోంది.


మరి తనను తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేసిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని జగన్ క్షమిస్తారా అనందే ఇక్కడ ప్రశ్న. అంతే కాదు, కాంగ్రెస్ కూటమికి జగన్ మద్దతు ఇచ్చి రాహుల్ ని ప్రధాని చేయడానికి క్రుషి చేస్తారా అన్నది కూడా మరో ప్రశ్న. కాంగ్రెస్ ఒకసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీలో పుంజుకోవడానికి చూస్తుంది. వైసీపీ ఓటు బ్యాంక్ కూడా ఆ పార్టీదే. ఆ విధంగా కాంగ్రెస్ ఏపీలో పెరిగితే వైసీపీ అంతకు అంత నష్టపోతుంది. మరి ఈ విషయాలు తెలిసి జగన్ కాంగ్రెస్ కి స్నేహ హస్తం చాచుతారా అన్నవి ఎన్నో ప్రశ్నలు, మరి జగన్ వీటిని ఏ రకమైన జవాబు చెబుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: