గత నెల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో 11 న పోలింగ్ జరిగింది.  తెలంగాణలో పార్లమెంట్, ఏపిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.  ఈ నేపథ్యంలో  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.  కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే.  ఉదయం జరగాల్సిన పోలింగ్..రాత్రి వరకు కొనసాగులేదు.  కొన్ని చోట్ల తప్పని పరిస్థితిలో చికటి పడే వరకు కూడా పోలింగ్ కొనసాగించారు.   

ఈ నెల కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో  ఏపీలో ఎన్నికల ఫలితాల టెన్షన్ రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది.  కమ్మపల్లి బూత్ నెంబర్ 321, పులివర్తిలోని బూత్ నెంబర్ 104, కొత్తకండ్రిగలోని బూత్ నెంబర్ 316, కమ్మపల్లిలోని బూత్ నెంబర్ 318, వెంకట్రామాపురంలోని బూత్ నెంబర్ 313లలో రీ పోలింగ్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, ఇక్కడ  19న రామచంద్రాపురంలోని నాలుగు పోలింగ్ బూత్ లలో, పాకాల మండలంలోని ఒక పోలింగ్ బూత్ లో ఎన్నికలు రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.  అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మెరాయించడంతోపాటు మరికొన్ని చోట్ల గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో 10 పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిలు ఎన్నికల సంఘాన్ని కోరారు. 

అంతే కాదు చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో తాము పోరాటానికి సన్నద్దమవుతామని హెచ్చరించారు.  ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈసీ రీ పోలింగ్ కు ఆదేశాలు జారీ చేశారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: