అదేంటో చంద్రబాబుని ఎలాగైనా కాపాడాలని, ఏపీలో తెలుగు జెండా శాశ్వతంగా ఎగరేయాలని కొన్ని మీడియా విభాగాధిపతులకు, కొంతమంది బలమైన సామాజికవర్గం నేతలకు తెగ ఆరాటంగా ఉంది. నిజంగా బాబుకు ఆ కోరిక ఉందో లేదో తెలియదు కానీ బాబు వల్ల పలు రకాలుగా అవసరాలు పొందిన వారు మాత్రం ఎలాగైనా కేసీయార్, బాబులని కలిపేసి తమ రాజకీయ పబ్బం నెరవేర్చుకుందామనుకుంటున్నారు. ఇది ఇవాళ కొత్త కాదు.


తెలంగాణా ఎన్నికల ముందు నుంచి కేసీయర్ని బాబుని కలపాలని చూస్తూనే ఉన్నారు. బాబు సైతం తన బావమరిది హరిక్రిష్ణ పార్ధివ దేహం పక్కన పెట్టుకుని  ఈ పొత్తు విషయాలు కేటీయార్ తో చర్చిన సంగతి విధితమే. ఇక టీడీపీకి వంత పాడే ఓ తోక పత్రిక ఈ మధ్యనే తన మనసులోని మాటగా ఆ పత్రికలో రాసుకొచ్చింది. కేసీయార్, బాబు కలసి ఢిల్లీలో చక్త్రం తిప్పాలని, ఒకరు ప్రధాని, మరొకరు ఉప ప్రధాని కావాలని రాసుకొచ్చింది.


ఇదిలా ఉంటే నిన్న హఠాత్తుగా రామోజీరావు బాబుని తన వద్దకు రప్పించుకుని భేటీ వేయడం వెనక రాజకీయాలే ప్రధానమని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ భేటీకి మరో ట్విస్ట్ ఏంటి అంటే కేసీయార్ ని కూడా రామోజీరావు కూడా విందు సమావేశాలకు ఆహ్వానించారని. అయితే కేసీయార్ పొలైట్ గా  తాను రాలేనని చెప్పి వెళ్ళలేదుట. ఏపీలో బాబుకు వ్యతిరేకంగా వైసీపీతో టీయారెస్ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. దాంతో కేసీయార్ మిత్ర ధర్మంగా జగన్ వైపునే ఉంటున్నారు. మొత్తానికి ఈ ప్రయత్నం ఇపుడు ఆగినా ముందు ముందు జరగ‌దు అని కొట్టిపారేయలేం. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: