ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు మ‌రో ఆరు రోజుల టైం మాత్ర‌మే ఉంది. మ‌ళ్లీ గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్త‌మైన ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. నెల‌రోజుల‌కు పైగా తీవ్ర‌మైన ఉత్కంఠ ఎదుర్కొంటోన్న అభ్య‌ర్థుల భ‌విత‌వ్వ్యం ఆ రోజు పూర్తిగా వెల్ల‌డి కానుంది. ఇక తెలుగు రాజ‌కీయాల్లో బెట్టింగ్‌ల ప‌ట్ల ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందులోనూ ఏపీలో ఈ సంస్కృతి చాలా ఎక్కువ‌. పొలిటిక‌ల్ బెట్టింగులు మామూలుగా జ‌ర‌గ‌వు. ఈ క్ర‌మంలోనే ఏపీ సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌రుగుతోన్న ర‌క‌ర‌కాల బెట్టింగులు ఆస‌క్తిగా న‌డుస్తున్నాయి.

బెట్టింగుల్లో మెజార్టీ పందేలు వైసీపీ వైపే ఉన్నాయ‌న్న‌ది గ్రౌండ్ లెవ‌ల్లో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏపీలో జ‌గ‌న్ గెలిచి సీఎం అవుతున్నాడ‌ని... టీడీపీ కంటే వైసీపీకి ఒక్క సీటు అయినా ఎక్కువ వ‌స్తుందని.... అలాగే ఎంపీ సీట్ల‌లో కూడా వైసీపీకే ఎక్కువ వ‌స్తాయ‌న్న పందేల‌తో పాటు ఈ రెండు పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కులు పోటీ చేస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై కూడా భారీ ఎత్తున బెట్టింగులు న‌డుస్తున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ పోటీ చేసిన పులివెందుల‌లో ఆయ‌న గెలుపు కంటే కూడా మెజార్టీ ఎంత‌న్న దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు భారీ ఎత్తున న‌డుస్తున్నాయి.

ఇక సీఎం చంద్ర‌బాబు కుప్పం మెజార్టీ కంటే పులివెందుల‌లో జ‌గ‌న్ మెజార్టీయే ఎక్కువ ఉంటుంద‌ని... ఇక హిందూపురం, మంగ‌ళ‌గిరిలో బాల‌య్య‌, లోకేష్ గెలుస్తారా ?  లేదా వాళ్ల మెజార్టీ ఎంత‌న్న బెట్టింగులు కూడా న‌డుస్తున్నాయి. ఈ న‌లుగురు నేత‌ల గెలుపులో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు గెలుపుపై ఎవ్వ‌రికి పెద్ద‌గా అనుమానాలు లేవు. ఎటు తిరిగి ఈ సారి హిందూపురంలో బాల‌య్య ఏటికి ఎదురీదుతున్నాడ‌ని... అలాగే మంగ‌ళ‌గిరిలో లోకేష్‌కు గెలుపు సులువు కాద‌న్న టాక్ అయితే పోలింగ్ ముగిసిన‌ప్ప‌టి నుంచి న‌డుస్తూనే ఉంది. 

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఓ అదిరిపోయే బెట్టింగ్ ఆఫ‌ర్‌ను వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్ల‌కు ఇస్తున్నారు. కుప్పంలో చంద్ర‌బాబు, హిందూపురంలో బాల‌య్య‌, మంగ‌ళ‌గిరిలో లోకేష్‌కు వ‌చ్చే మెజార్టీ కంటే పులివెందుల‌లో జ‌గ‌న్‌కే ఎక్కువ మెజార్టీ వస్తుంద‌ని పందెం వేస్తున్నారు. కుప్ప‌లంలో చంద్ర‌బాబుకు ఈ సారి 40 వేల‌కు అటూ ఇటూగానే మెజార్టీ ఉంటుందంటున్నారు. బాల‌య్య‌, లోకేష్ గెలిస్తే 10 వేల లోపు మెజార్టీయే అంటున్నారు. ఇక జ‌గ‌న్‌కు ఈ సారి మెజార్టీ ల‌క్ష క్రాస్ అవుతుంద‌ని వైసీపీ లెక్క‌లు వేస్తోంది. ఇక టీడీపీ వాళ్లు మాత్రం జ‌గ‌న్ మెజార్టీ బాగా త‌గ్గించామ‌ని చెపుతున్నారు. ఏదేమైనా ఈ పందెం మాత్రం ఏపీలోనే అత్యంత ఆస‌క్తిక‌రంగా ఉంది. మ‌రి ఈ పందెంలో ఎవ‌రు విన్ అవుతారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: