ఎన్నికలు వస్తున్నాయంటే గెలుపు కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్దపడుతుంటారు. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టే విషయంలో ఒకరిని మించి ఒకరు లేని పోని ఆశలు చూపించడం..డబ్బు, వస్తు, మద్యం ఇలా ఎన్నో రకాలుగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.  తాజాగా  భీమిలి టీడీపీ అభ్యర్ధి గా పోటీ చేస్తున్న సబ్బం హరి ఒక ఎమ్మార్వో ద్వారా ఉద్యోగుల డేటా మొత్తం సేకరించినట్లు సమాచారం. 


ఈ నేపథ్యంలో  ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రలోభాల వల విసిరాడు, సబ్బం హరి మాట్లాడిన ఆడియో టేపులను పరిశీలించిన విచారణ కమిటీ.. అది కచ్చితంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని భావించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చారట. 


ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్య తీసుకోబోతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..కలెక్టరేట్లోని కొంతమంది ఉన్నతోద్యోగులు పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారంటూ ఊహాగానాలు చేస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: