అత్యంత హోరా హోరీగా సాగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తి సీటును, ప్ర‌తి ఓటును టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తి ష్టాత్మ‌కంగా భావించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆచితూచి ఎలాంటి సిఫార‌సుల‌కుకూడా త‌లొగ్గ‌కుం డా టికెట్లు కేటాయించారు. దీనికి వెనుక చంద్ర‌బాబు ల‌క్ష్యం ప్ర‌తి సీటులోనూ విజ‌యం సాధించ‌డ‌మే. ప్ర‌తి ఓటును టీడీపీకి అనుకూలంగా వేయించుకోవ‌డ‌మే. ఈ కార‌ణంగానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఇక‌, ఎన్నిక‌ల్లోపోల్ మేనేజ్‌మెంట్‌ను కూడా చంద్ర‌బాబు బాగానే క‌వ‌ర్ చేశారు. అయితే, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం త‌మ్ముళ్లు ఎన్నిక‌ల‌కు ముందుగానే చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపించింది. ఇక‌, తాము గెలిచే ప‌రిస్థితి లేద‌ని వారు ముందుగానే డిసైడ్ అయిపోయారు. 


అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క‌మైంది రాజ‌ధాని జిల్లా గుంటూరులోని ప‌శ్చిమ నియోజ‌కవ‌ర్గం. ఇక్క‌డ నుంచి 2014లో వైసీపీ త‌ర‌ఫున మ‌హ‌మ్మ‌ద్ ముస్తాఫా పోటీ చేశారు. మంచి మార్కుల‌తో ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ము ఖ్యంగా వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ముస్తాఫా ఆదుకున్నారు. జ‌గ‌న్ వ‌ద్ద కూడా మంచి మార్కులు సంపాయించుకున్నారు. గుంటూరులోని మైనార్టీ వ‌ర్గాన్ని వైసీపీ వైపు మ‌ళ్లించ‌డంలోనూ ముస్తాఫా స‌క్సెస్ అయ్యారు. దీంతో ఈ ద‌ఫా కూడా ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ముస్తాఫానే పోటీకి దిగారు. ఇక‌, ఈయ‌న‌కు మాస్ నుంచి క్లాస్ వ‌ర‌కు మంచి పేరు సంపాయించుకున్నారు. 


ఇక‌, అదే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వైశ్య వ‌ర్గానికి చెందిన మ‌ద్దాలి గిరి కి అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఆయ‌న ఓట‌మిపాల య్యారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ గుంటూరు మొత్తాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ప‌క్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు నుంచి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ కీల‌క‌మైన నాయ‌కుడైన మ‌హ‌మ్మ‌ద్ న‌జీర్‌ను చంద్ర‌బాబు నిల‌బెట్టారు. ఇదిలావుంటే, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1994లో మాత్ర‌మే గెలిచిన టీడీపీ.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ గెల‌వ‌లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌రేలేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడైనా ఎగ‌రేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. 


కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే. వైసీపీకే అనుకూలంగా ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా తెలిసింది. ఇక్క‌డ నుంచి గ‌త ఎ న్నిక‌ల్లో విజ‌యం సాధించిన ముస్తాఫాకే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్టేందుకురెడీ అయ్యార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుడిగా ఉన్నా కూడా నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండడం, నీటి స‌ర‌ఫ‌రాకు సొంత నిధులు వ్య‌యం చేయ‌డంతోపాటు.. కీల‌క‌మైన తాగునీటి స‌మ‌స్య‌కు సైతం చెక్ పెట్టేలా ముస్తాఫా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఇక్క‌డ ఎవ‌రి నోటీ విన్నా ముస్తాఫా పేరే వినిపిస్తోంది. దీనిని గ‌మ‌నించిన టీడీపీ నాయ‌కులు ఇక‌, ఇక్క‌డ టీడీపీ గెలుపు క‌ష్ట‌మేన‌ని, వ‌చ్చే 2024 నాటి ఎన్నిక‌ల్లోనే తేల్చుకుంటే బెట‌ర్ అని సూచిస్తున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: