తాను ప్రధాని రేసులో లేనని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారని వార్తలలో లీక్ ఇచ్చారంటే అర్ధం "ప్రధాని రేస్" అనే సందర్భం వస్తే ఆయన పేరే గుర్తుకు రావాలనేదే ఈ  లీకుల వ్యూహం, అంటున్నారు చంద్రబాబుకు అతిదగ్గరగా ఉన్న రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన సందర్భంగా నిన్న ఎపిలో వంద శాతం టిడిపి గెలుస్తుందని తెలుగుదేశం నాయకులకు ధైర్యం నూరిపోశారు. ఏ వైద్యుడైనా మృత్యుపీఠం మీద ఉన్న రోగికి సైతం నీవు అద్భుతంగా బ్రతుకుతావు అనే చెపుతారు.
Image result for VP singh and NTR
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకి తాను చేస్తున్న ప్రయత్నాలు, అక్కడ ఏ పదవీ ఆశించి చేయడం లేదని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు వివిధ వేదికలపై మాట్లాడి నప్పుడు స్పష్టంగా చెప్పాలని ఆయన తన అనుయాయులకు ఆదేశాలిచ్చారు.  నారా చంద్రబాబు ఏమీ ఆశించకుండా ఏదీ చేయరనేది జగ మెరిగిన సత్యం. నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా చేయటమే దేశంలోని ప్రతిపక్షాలన్నిటీ ఏకైక లక్ష్యం అయితే అది చంద్రబాబుకు జీవితాశయం. ఏపిలో టిడిపి అధికారంలోకి రావటం కంటే ఆయనకు మోదీ ఓటమే ముఖ్యం. మోడి అధికారంలోకి వస్తే చంద్రబాబు జీవితం శంకరగిరి మానాలే. 

ఒకప్పుడు ఎన్టీఆర్‌ జాతీయస్థాయిలో నిర్వహించిన పాత్రను, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తాను నిర్వహిస్తున్నానన్నారు. నాడు ఎన్టీఆర్‌ పోషించిన పాత్రకు ప్రతిఫలంగా  కేంద్రంలో ఆయన్ను నాటి విపక్షాల సమాఖ్య కన్వీనర్ విపి సింగ్ నిర్ద్వంధంగా తిరస్కరించారు. కారణం రాష్ట్రంలో ఆయనను ప్రజలు తిరస్కరించటమే. ఇప్పుడూ అదే జరుగుతుందనేది వాస్తవం. 
Image result for alternative to Modi in Centre
“2014లో కొన్ని జాతీయ ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పాయని, కానీ తెదేపా ఘన విజయం సాధించిందని” ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఆదివారం కూడా కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని, కానీ 23న వెలువడే ఫలితాల్లో గెలుపు తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు చెప్పారట. 

అయితే నాడు తనకు బాజపా, పవన్ కళ్యాన్ బాసటగా నిలిచారు అంతేకాదు ఈయన నాలుగు దశాబ్ధాల అనుభవం అనే క్వాలిఫికేషన్ అదనపు ఆకర్షణగా నిలవగా - నేడు ఆయన సుధీర్ఘ అనుభవం ఏమాత్రం ప్రజలకు పనికిరాని వృధా పదార్ధమని తేలిపోగా ప్రజలు ఆయన్ను అతి ధారుణంగా తిరస్కరించబోతున్నారు అనేది సమాచారం. 
ఇక కేంద్రంలో చక్రం త్రిప్పటానికి బదులు పొత్రమో, బొంగరమో త్రిప్పుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. 

చంద్రబాబు పార్టీ రాష్ట్రంలో ప్రజా తిరస్కరణకు గురైతే ఆయన్ను కేంద్రంలో ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా, నాడు ఎన్ టీఆర్ కు ఎదురైన తిరస్కారమే ఆయనకు లభించవచ్చు. అందుకే 23వ తారీఖు సాయనత్రం వరకు హాపీగా బ్రతకవచ్చు. ఆ తరవాత ఆయనలో ఆనందం అహ్లాదం హారతి కర్పూరంలా ఆవిరవ్వక తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: