లగడపాటి సర్వే ఇపుడు ఏపీలో సంచనలంగా మారింది. నిజానికి ప్రీ పోల్,  పోల్ పోస్ట్ పోల్ సర్వేలు ఏవీ కూడా ఇంతవరకూ ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పలేదు. అదే సమయంలో అన్ని సర్వేలు వైసీపీ అంటూ వచ్చాయి. ఈ నేపధ్యంలో టీడీపీ గెలుస్తుందని ఎగ్టిట్ పోల్ సర్వేల కంటే లగడపాటి హింట్ ఇచ్చేశారు. ఏపీ ప్రజలు సైకిలెక్కారని ఆయన చెప్పుకొచ్చారు.


మరి లగడపాటి సర్వే ఇవాళ సాయంత్రం విడుదల అవుతుంది. అయితే లగడపాటి అమెరికా యాత్ర మధ్యలో ఏపీకి వచ్చేటపుడే తనకు సన్నిహితులైన కొందరికి ఈ సర్వే వివరాలు చెవుల్లో వూదారని అంటున్నారు. ఆ వివరాలు ఆ నోటా ఆ నోటా బయటకు వస్తున్నాయి. అందులో నిజమెంతుందో  తెలియదు కానీ లగడపాటి సర్వేలో టీడీపీకి 103 సీట్లు ఇచ్చారని తెలుస్తోంది.


అదే విధంగా వైసీపీకి 55 నుంచి 60 సీట్ల వరకూ ఇచ్చారని చెబుతున్నారు. మరి మిగిలిన సీట్లు జనసేనకు ఇచ్చారని అంటున్నారు. జనసేనకు 12 సీట్ల వరకూ రావచ్చునని అంటున్నారు. మరి టీడీపీకి 103 అంటే గతసారి కంటే రెండు తగ్గినట్లు, అదే  వైసీపీకి 60 అంటే ఏడు తగ్గినట్లు, బీజేపీకి నాలుగు అప్పట్లో వచ్చాయి. ఇలా మొత్తం సీట్లు కలుపుకుని ఈసారి జనసేన సాధిస్తుందని అంటున్నారు.

మొత్తానికి టీడీపీ సరిపడా సీట్లతోనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. అంటే అయిదేళ్ళ తరువాత వైసీపీ ఏడు సీట్లు కోల్పోయి అసెంబ్లీలో అడుగుపెడుతుందని లగడపాటి వారు జోస్యం చెప్పారంటున్నారు. మరి ఇది నిజంగా లగడపాటి అంకెలేనా అన్న డౌట్ కూడా ఉంది. అయినా అసలు ఫలితాలు ఈ నెల 23న వస్తాయి కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: