తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని పర్‌ఫెక్టుగా అంచనా వేసిన సర్వేల సంస్థ ఆరా (AARAA) తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కూడా త‌న ఫ‌లితాల‌ను ఇప్ప‌టికే అన‌ధికారికంగా వెల్ల‌డించేసింది. ఇప్ప‌డికే ఈ స‌ర్వే ఫ‌లితాలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఏపీలో వైసీపీ 120 సీట్ల‌తో తిరుగులేకుండా అధికారంలోకి రాబోతుంద‌ని ఈ స‌ర్వే ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయి. ఇక ఆరా సంస్థ స‌ర్వేను న‌మ్మాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. 


గ‌తేడాది చివ‌ర్లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆరా టీఆర్ఎస్‌కి 85కి పైగా స్థానాలు వస్తాయని తెలిపింది. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 సీట్లు గెలిచింది. అలాగే 2016లో జరిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 100 డిజ‌విన్ల‌లో గెలుస్తుంద‌ని చెప్ప‌గా... ఖ‌చ్చితంగా అదే జ‌రిగింది. దీంతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కూడా ఈ సంస్థ ముందే ఖ‌చ్చితంగా చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఏపీ ఎన్నిక‌ల‌పై చేసిన స‌ర్వేల్లోనూ తాజాగా త‌న ఫ‌లితాలు చెప్పింది.


2008లో ఏర్ప‌డిన ఆరా 2009లో స‌మైక్య రాష్ట్రంలో చెప్పిన‌ట్టే వైఎస్.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చారు. 2009 జార్ఖండ్, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా ఫలితాలు దాదాపు అసలు ఫలితాలతో సరిపోలాయి. 2012లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆరా కచ్చితమైన అంచనాలు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆరా చెప్పింది అదే జరిగింది. ఇలా ఆరా స‌ర్వే ఫ‌లితాల‌న్ని ఖ‌చ్చితంగా నూటికి నూరు శాతం నిజ‌మ‌య్యాయి.


తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండుసార్లు, ఎన్నికల తర్వాత ఒకసారీ సర్వే చేసింది ఆరా. ఈ సర్వేల్లో వైసీపీకి 120 నుంచీ 125 సీట్లు వస్తాయని తేలింది. అలాగే 20 దాకా ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని సమాచారం. కొన్ని ఇతర సర్వేల్లో చెప్పినట్లే... టీడీపీకి 50 సీట్ల లోపే వస్తాయని ఆరా సర్వేలో కూడా తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: