జాతీయ చానళ్ళు అన్నీ కూడా దాదాపుగా వైసీపీ విజయం ఏపీలో ఖాయమని తేల్చేశాయి. ప్రీ పోల్ సర్వేలకు ధీటుగా ఎగ్టిట్ పోల్ సర్వేలు కూడా జగన్ కే జై కొట్టాయి. పైగా వైసీపీ పెద్ద ఎత్తున విజయం సాధించబోతోందని కూడా గట్టిగా చెప్పేశాయి.


ఇక ఏపీలో ఒకే ఒక్కడు లగడపాటి రాజగోపాల్ మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్పారు. అంతవరకూ బగానే ఉన్న లగడపాటి కూడా టీడీపీకి ఇచ్చిన సీట్లు 100 మార్క్ దాటలేదు. పైగా ప్లస్ మైనస్ అని కూడా చెప్పారు. దాంతో టీడీపీ విజయానికి దగ్గర ఉందా వెనబడిందా అన్నది తేలడంలేదు


ఇక ఇదే లగడపాటి సర్వేలో వైసీపీకి ఏకంగా 79 సీట్లు ఇచ్చేశారు. దానికి పది శాతం ప్లస్, మైనస్ అన్నారు. అంటే ప్లస్ అనే తీసుకుంతే మ్యాజిక్ ఫిగర్ కి చేరువ అయినట్లే కదా. ఓ విధంగా లగడపాటి సర్వే కూడా జగన్ గెలవవచ్చు అని చెబుతూనే టీడీపీ అంటోంది. ఇక స్వయంగా లగడపాటి వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది ఏపీలో అని చెప్పారు. 


వోట్ల షేర్ తీసుకున్నా టీడీపీకి 43 శాతం ఇచ్చారు. వైసీపీకి 40 శాతం  పైగా ఇచ్చారు అంటే ఒక్క శాతం  మాత్రమే వెనకబడినట్లు. మరి ఇది తన అంచనా మాత్రమేనని చెబుతున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే లగడపాటి సర్వే సైతం వైసీపీ ఎంత స్ట్రాంగ్ గా జనాలకు చేరువ అయిందో చెప్పకనే చెప్పేసింది. అలాగే జగన్  పాదయాత్ర, నవరత్నాలు కూడా  బాగానే ప్రభావాన్ని  చూపాయని లగడపాటి అనడం విశేషం. మొత్తానికి చూసుకుంటే ఏపీలో మార్పునకు జనం ఓటేసారని తేలుప్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: