సార్వత్రిక ఎన్నికలు చివరి విడత పోలింగ్ ముగిసింది. 542 లోక్‌సభ స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల శాసనసభ స్థానాలకు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెలువడున్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నా... 23వ తేదీ మధ్యాహ్నం వరకు కొత్త  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరనేదానిపై క్లారిటీ రానుంది.
 
ఇదిలాఉండ‌గా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లు చేస్తోంది... ఈ నెల 26వ తేదీన ప్రధాన మంత్రి ప్రమాణస్వీకారానికి రాష్ట్రపతి భవన్‌లో సన్నాహాలు చేస్తున్నారు. కాగా, అన్ని స‌ర్వేల్లో ఎన్డీఏకే అధికార‌మని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: